calender_icon.png 24 October, 2025 | 3:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ నెల 26న మెగా జాబ్ మేళా

22-10-2025 05:48:22 PM

సింగరేణి ఏరియా జిఎం రాధాకృష్ణ..

మందమర్రి (విజయక్రాంతి): కోల్ బెల్ట్ ప్రాంతంలోని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఈ నెల 26న బెల్లంపల్లి పట్టణంలో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ ఎన్ రాధాకృష్ణ తెలిపారు. పట్టణంలోని జీఎం కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బెల్లంపల్లిలోని ఎఎంసీ గ్రౌండ్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థ, నోబుల్ ఎంపవర్ మెంట్, వారిచే సంయుక్తంగా మెగా జాబ్ మేళా-2025ను నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు. ఈ జాబ్ మేళాకు, కోల్ బెల్ట్ ప్రాంతాలైన మందమర్రి, బెల్లంపల్లి, పరిసర ప్రాంతాలలోని సుమారు 7 వేల మంది నిరుద్యోగ యువత హాజరయ్యే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ జాబ్ మేళాలో దాదాపు 70 ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయని, నిరుద్యోగ యువత ప్రయోజనం పొందే దిశగా ఏర్పాట్లు చేసినట్లు ఆయన వివరించారు.

ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్, రిటైల్, ఐటి, నాన్ ఐటి, డిజిటల్ మార్కెటింగ్, సర్వీస్ సెంటర్లకు చెందిన ప్రముఖ సంస్థలలో నియమాకాలు చేపట్టనున్నామని, సాధ్యమైనంత వరకు అదే రోజు నియామక పత్రాలు అందే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. సింగరేణి సంస్థ కేవలం బొగ్గు ఉత్పత్తికే పరిమితం కాకుండా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ముందుంటుందని ఆయన స్పష్టం చేశారు.

సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకట్ స్వామి ల సహకారంతో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామ న్నారు. ఉద్యోగాల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా వారి సొంత ప్రాంతంలోనే వివిధ రంగాల ప్రముఖ కంపెనీలో ఉద్యోగాలు పొందేలా ఈ వేదికను ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీని ద్వారా స్థానిక యువత ఉజ్వల భవిష్యత్తుకు పునాది పడుతుందని ఆశిస్తున్నట్లు, భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జిఎం విజయ ప్రసాద్, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, ఐఈడి ఎస్ఈ కిరణ్ కుమార్, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ సత్యనారాయణ, గోగర్ల శోభన్ బాబు  నోబెల్ ఎంపవర్మెంట్ స్టేట్ మేనేజర్ లు పాల్గొన్నారు.