02-07-2025 12:28:28 AM
చిగురుమామిడి, జూన్ 1(విజయక్రాంతి): మహిళా సంఘాల సభ్యులను ఓపెన్ టెన్త్, ఇంటర్ చదివించాలని ఎంపీడీవో బాసం మధుసూదన్ సూచించారు. మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం బాసం మధుసూదన్, ఎంఈవో పావని, ఏపీఎం మట్టెల సంపత్ ఆధ్వర్యంలో హెడ్మాస్టర్లు, వివోలు, సీసీల కు సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడు తూ మండలంలోని వివిధ గ్రామాల స్వయం సహాయక సంఘాల సభ్యులలో ఒకటో తరగతి నుండి పదో తరగతి, ఇంటర్ ఫెయిల్ అయిన సభ్యుల వివరాలు సేకరించామని, వారిని పదో తరగతి పరీక్షల కోసం మీ సేవ కేంద్రాల ద్వారా నమోదు చేయించాలని,
ఓపెన్ టెన్త్ ఫీజు ఓ సీ అభ్యర్థులకు రూ. 1550, ఎస్సి, ఎస్టి, బీసీ, మైనార్టీ అభ్యర్థులకు రూ. 1150, ఇంటర్ కు అడ్మిషన్లకు ఓసీ అభ్యర్థులకు రూ.1800, ఎస్సి, ఎస్టి, బీసీ, మైనార్టీ అభ్యర్థులకు రూ.1500 చెల్లించాలని వివరించారు. అర్హత కలిగిన ప్రతి సభ్యురాలిని టెన్త్, ఇంటర్ పరీక్షలు ఓపెన్ స్కూల్ ద్వారా రాసేందుకు ప్రోత్సహించాలనిసూచించారు.