calender_icon.png 2 July, 2025 | 8:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై నజర్

02-07-2025 12:31:47 AM

- టికెట్ కోసం కాంగ్రెస్ నేతల ప్రయత్నాలు

- ఇన్‌చార్జి మంత్రిని కలిసి వినతులు

-తెరపైకి లోకల్ లీడర్ మురళీధర్‌గౌడ్ పేరు

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 1 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హఠాన్మరణంతో ఉప ఎన్నిక వేడి రాజుకుంది. అధికార పార్టీ నేతలు కొందరు ఇప్పటికే టికెట్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. అధిష్ఠానానికి తమ ఆసక్తిని తెలియజేస్తున్నారు. అయితే కాంగ్రెస్‌కు హైదరాబాద్ నగరంలో కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్నందున జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం సాధించి ఎమ్మెల్యేల సంఖ్యను పెంచుకోవాలని భావిస్తున్నది.

ఆ దిశగానే పార్టీ ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తున్నది. అయితే స్థానిక నేతలైతేనే విజయం సులువు అవుతుందనన ఆలోచనలో పార్టీ అధిష్ఠానం ఉన్నట్టు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి, ఓటమి పాలైన మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కాకుండా స్థానికంగా పట్టున్న అభ్యర్థి కోసం అన్వేషణ ప్రారంభించినట్లు సమాచారం. అయితే ఇప్పటికే పలువురు ఆశావాహులు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి టికెట్ ఇప్పించాల్సిందిగా వినతులు కూడా సమర్పించినట్టు తెలుస్తున్నది. అయితే నియోజకవర్గంలో విజయం సాధించాలన్న విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్టు తెలిసింది. ఈ మేరకు లోకల్ లీడర్‌ను బరిలోకి దింపాలని పార్టీ క్యాడర్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన లీడర్లంతా స్థానికేతరులే కావడంతో ఈసారైనా లోకల్ లీడర్‌కు టికెట్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. 

మురళీధర్‌గౌడ్ వైపే మొగ్గు?

స్థానిక నేతను బరిలో దించాలనుకుంటున్న కాంగ్రెస్ అధిష్ఠానం మాజీ కార్పొరే టర్ మురళీధర్‌గౌడ్ వైపు మొగ్గుచూపుతున్నట్టుగా తెలుస్తున్నది. జూబ్లీహిల్స్ నియొజ కవర్గంలోని పలు డివిజన్ల నుంచి రెండుసార్లు కార్పొరేటర్‌గా గెలిచిన మురళీధర్ గౌడ్ పేరు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. మురళీధర్‌గౌడ్‌కు పార్టీ టికెట్ కేటాయిస్తే, గెలిపించుకుంటామనే ధృడ సంక ల్పంతో పార్టీ క్యాడర్ ఉన్నట్టు తెలిసింది. మురళీధర్‌గౌడ్ గతంలో సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి టీడీపీలో పని చేసిన సాన్నిహి త్యం ఉన్నది.

1975 నుంచి అప్పటి ఖైరతాబాద్ నుంచి వరుసగా గెలిచిన పీజేఆర్‌తో కలిసి కాంగ్రెస్  పార్టీలో క్రియాశీల కార్యకర్తగా పని చేసిన మురళీధర్‌గౌడ్ ఆ తర్వాత టీడీపీ నుంచి కార్పొరేటర్‌గా పోటీ చేసి గెలిచారు. మరోసారి ఆయన కుమారుడ్ని కా ర్పొరేటర్‌గా గెలిపించి స్థానికంగా పలు అభివృద్ధి పనులు చేసి ప్రజల్లో తమదైన ముద్ర వేసుకున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే సీఎం రేవంత్‌రెడ్డిని టికెట్ అభ్యర్థించినట్లు తెలిసింది. టికెట్ కోసం పోటీ పడుతున్న ఆశావాహుల్లో అందరూ స్థానికేతరులే కావటంతో అధిష్ఠానం కూడా మురళీధర్‌గౌడ్ వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.