calender_icon.png 2 July, 2025 | 7:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యథేచ్ఛగా కృత్రిమ కల్లు విక్రయం?

02-07-2025 12:28:35 AM

-పేద ప్రజల ప్రాణాలు బేజారు...

-కల్తీ కళ్ళు విక్రయించిన వారిపై కేసులు చేసేందుకు వెనకడుగు

-కేవలం ఒకరిద్దరిపై కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్న వైనం...

-బాన్సువాడ ఎక్సైజ్ సీఐ పని తీరుపై విమర్శలు...

-విచ్చలవిడిగా కళ్ళు దుకాణాలు నిర్వహించేందుకు ఎక్సైజ్ సీఐ అనుమతి 

-ఎక్సైజ్ సీఐపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకునేనా...?

బాన్సువాడ జూలై 1(విజయ క్రాంతి): కల్తీ, కృత్రిమ కల్లు తయారీ కోసం వాడే రసాయనాల వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. ప్రకృతి సిద్ధంగా వచ్చే కల్లును కల్తీ చేయడం, కృత్రిమంగా రసాయనాలతో తయారు చేసి విక్రయిస్తున్నారు. కృత్తిమ కళ్ళు విక్రయించడంతో పేద ప్రజల ప్రాణాలు బేజారుగా మారుతున్నాయి.

తాటి, ఈత చెట్ల నుంచి కల్లు అంతగా రాని ప్రస్తుతం గ్రామాల్లో కొందరు కృత్రిమ కల్లును విక్రయిస్తున్నా కూలీలు, పేదలు తాగి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. కృత్రిమ, కల్తీ కల్లు తయారీకి ఉపయోగించే క్లోరల్ హైడ్రేట్, డైజోఫాం వంటి వాటిని పెద్ద ఎత్తున మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి జిల్లాకు తరలించి నిల్వ చేస్తున్నారు. ఈ దందాను అరికట్టాల్సిన ఆబ్కారీ శాఖ చోద్యం చూస్తుందన్న విమర్శలున్నాయి. మత్తు కోసం డైజోఫాం, క్లోరల్ హైడ్రేట్, క్లోరోఫాం, ఆల్ట్రాజోలం, రుచి కోసం శాక్రిన్ కలుపుతున్నారు.

మోతాదుకు మించి రసాయనాలు కలిపి తయారు చేస్తున్న కల్లును తాగుతున్న అమాయక కూలీలు, పేదలు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఎప్పటికప్పుడు కల్లు అమ్మకాలపై తనిఖీలు నిర్వహించి పరీక్షలు నిర్వహించాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులు ముడుపులు పుచ్చుకుని కిమ్మనడంలేదనే ఆరోపణలున్నాయి. అదేవిధంగా గత రెండు నెలలు క్రితం నస్రుల్లాబాద్ మండలంలో 68 మంది తీవ్ర అస్వస్థకు గురైనప్పటికీ కల్తీకల్లు తయారుచేసిన విక్రయించిన వారిపై కేసులు నమోదు చేసేందుకు ఎక్సైజ్ శాఖ అధికారులు వెనుకడుగు వేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి ఒకరిద్దరిపై కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారని విమర్శలు ఉన్నాయి.

బాన్సువాడ ఎక్సైజ్ సీఐ పని తీరుపై తీవ్ర విమర్శలు వెలువడుతున్నాయి ఇష్టం వచ్చినట్లు కళ్ళు దుకాణాలు విక్రయించేందుకు అనుమతులు ఇచ్చి గుత్తి మొక్కలు దారులకు వత్తాసు పలికారు అనే ఆరోపణలు ఉన్నాయి బాన్సువాడ ఎక్సైజ్ శాఖ పరిధిలో అనుమతులు కేవలం కొన్ని కళ్ళు దుకాణాలకు మాత్రమే ఉన్నాయని మిగతా కళ్ళు దుకాణాలు పూర్తిగా అనుమతులు లేకుండా ఎక్సైజ్ సీఐ అనుమతితోనే కొనసాగుతున్నాయని విమర్శలు వెలువెత్తుతున్నాయి ఎక్సైజ్ సీఐ పనితీరుపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకునేలా అధికారులు విచారణ చేపట్టాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నారు. కల్తీకల్లి విక్రాయులపై అక్రమంగా వెలిసిన కళ్ళు దుకాణంలో వెంటనే మూసి వేయించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ఇప్పటికైనా ఎక్సైజ్ సీఐ పై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబాలు ఉన్నత అధికారులను వేడుకుంటున్నారు.

ఊరురా కల్లు కాంపౌండ్లకు అడ్డాలు...

ప్రకృతి సిద్ధమైన తాటి, ఈత చెట్ల నుంచి తీసిన కల్లు ఆరోగ్యకరమైంది. స్వచ్ఛమైన ఈ కల్లును సేవించడం వల్ల కిడ్నీ సంబంధిత సమస్యలు సైతం నయమవుతాయి. డిమాండ్ మేరకు ఉత్పత్తి లేకపోవడం,  మద్యం ధరలు ఎక్కువగా ఉండటంతో రోజువారీ కూలీలు కృత్రిమంగా లభించే కల్లుకు అలవాటుపడుతున్నారు. ప్రజల్లోని ఈ బలహీనతను కొంత మంది కల్లు వ్యాపారులు సొమ్ము చేసుకుంటారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో క్లోరోహైడ్రేట్, డైజోఫామ్, ఆల్పాజోలమ్ వంటి ప్రమాదకరమైన రసాయణాలను వినియోగించి కల్తీ కల్లును తయారు చేస్తున్నారు. అక్రమ కృత్రిమ కల్లును అరికట్టాలని కోరురా వెలసిన అనుమతులు లేని కళ్ళు కాంపౌండ్లను సీజ్ చేయాలని ప్రజలు కోరుతున్నారు. 

కేసులు నమోదు చేసేందుకు వెనకడుగు 

కల్తీ కృత్రిమ కళ్ళు తయారిదారులపై విక్రయదారులపై కేసులు నమోదు చేసేందుకు ఎక్సైజ్ శాఖ అధికారులు వెనుకడుగు వేస్తున్నట్లు సమాచారం. ఎక్సైజ్ శాఖ అధికారులు కల్లు విక్రయదారుల తో కుమ్ముకై మామూల్లో మత్తులో జోగుతూ కేసులో వేసేందుకు ససే మీరా  అంటున్నారు. కల్తీ కళ్ళు విక్రయదారులు తయారీదారులు ఎక్సైజ్ శాఖ అధికారులతో అమ్యామ్యలు కొనసాగిస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. కేవలం ఒకరిద్దరిపై కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారని విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా అసలైన సూత్రధారులు పై కేసులు నమోదు చేసి అనుమతులు లేని కళ్ళు దుకాణాలను వెంటనే సీజ్ చేయాలని బాధ్యత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. 

బాన్సువాడ ఎక్సైజ్ సీఐపై తీవ్ర విమర్శలు...

బాన్సువాడ ఎక్సైజ్ శాఖ పరిధిలోని కళ్ళు దుకాణాలు కల్లు డిపోల ఏర్పాటుకు ఉచ్చలవిడిగా అనుమతులు ఇస్ మామూళ్ల మత్తులో జోగుతున్నారని విమర్శలు తీవ్రంగా ఉన్నాయి అంతే కాకుండా ఒక్కో గ్రామంలో ఒకటి లేదా రెండు కళ్ళు దుకాణాలు ఏర్పాటుకు అనుమతి ఇవ్వాల్సి ఉన్నప్పటికీ విచ్చలవిడిగా కళ్ళు దుకాణాల ఏర్పాటుకు అనుమతులు ఇస్తూ కళ్ళు తయారీదారులతో విక్రయిదారులతో కుమ్ముకై ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతున్నారని ఆరోపణలు కూడా తీవ్రంగా ఉన్నాయి.

గతంలో లైసెన్సుల జారీలు రెన్యువల్ లైసెన్సుల జారీలో భారీగానే అమ్యమ్యాలు అందినట్లు విశ్వాసనీయ సమాచారం. బాన్సువాడ ఎక్సైజ్ శాఖ పరిధిలో ఎక్సైజ్ సీఐ పై గతంలో కల్లుమాముల దారులు విక్రయదారులు తీవ్ర విమర్శలు చేసిన సంఘటనలు ఉన్నాయి. ఇప్పటికైనా బాన్సువాడ ఎక్సైజ్ శాఖ పరిధిలో అనుమతులు లేని కళ్ళు దుకాణాలను వెంటనే తొలగించాలని ఎక్సైజ్ శాఖ అధికారులు సీఐ పై పూర్తి విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబాలు కోరుతున్నారు.