calender_icon.png 19 August, 2025 | 12:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జర్నలిస్టులకు అండగా టీడబ్ల్యూజేఎఫ్

18-08-2025 11:33:32 PM

జిల్లా నాయకులు ఎర్రం సతీష్ కుమార్

రేగొండ మండల కేంద్రంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం

రేగొండ,(విజయక్రాంతి): జర్నలిస్టులకు అండగా నిలిచేది తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మాత్రమేనని, జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిరంతర పోరాటం చేస్తుందని టిడబ్ల్యూజెఎఫ్  జిల్లా నాయకుడు ఎర్రం సతీష్ కుమార్ అన్నారు. సోమవారం రేగొండ మండల కేంద్రంలో జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుకు జీతభత్యాలు లేకుండా 24 గంటలు నిద్రాహారాలు మాని ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలుస్తూ పనిచేస్తున్నారన్నారు.

అర్హులైన జర్నలిస్టుల కు ఆక్రిడిటేషన్, ఆరోగ్యానికి సంబంధించిన పాలసీ ప్రకటించి ఇండ్ల స్థలాలు కేటాయించి ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.జర్నలిస్టుల హక్కులు సాధించేవరకు పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. యూనియన్ సభ్యత్వ నమోదును పూర్తి చేసుకొని త్వరలోనే జిల్లా మహా సభలు నిర్వహించి నూతన జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరుగుతుందన్నారు.సంఘాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.అనంతరం మండల జర్నలిస్టులకు సభ్యత్వ పత్రాన్ని అందించి స్వాగతం పలికారు.