19-08-2025 12:06:12 AM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు నేపథ్యంలో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలను చేపట్టడం జరిగిందని జిల్లా పర్యవేక్షక ఇంజనీర్ సలియా నాయక్ తెలిపారు. ట్రాన్స్ఫార్మర్లు విద్యుత్తు స్తంభాలు వేలాడుతున్న విద్యుత్ తీగల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి సూచించడం జరిగిందన్నారు. ప్రజలు విద్యుత్ ప్రమాదకరంగా ఉన్న ప్రదేశానికి వెళ్లవద్దని ఏదైనా సహాయం కోసం విద్యుత్ శాఖ 19 12 టోల్ ఫ్రీ నెంబర్ను సంప్రదిస్తే విద్యుత్ సిబ్బంది వారికి అన్ని విధాల సహకారం అందిస్తారని తెలిపారు
నేడు ప్రజా వేదిక
విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి టీజీ ఎంపీటీసీఎల్ ఆధ్వర్యంలో మంగళవారం సమస్యల పరిష్కార వేదిక నిర్మిస్తున్నట్లు డి ఈ వెంకటేశ్వర్లు తెలిపారు. జిల్లా సర్కిల్ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు నిర్వహించే ఈ కార్యక్రమంలో విద్యుత్ సంబంధించిన ఏ సమస్య అయినా ఫిర్యాదు చేస్తే వాటిని పరిష్కరించేందుకు చర్యలు ఉంటాయని, ఈ అవకాశాన్ని విద్యుత్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.