19-08-2025 12:36:43 AM
ముంబై, ఆగస్టు 18: ఆర్థిక రాజధాని ముంబై భారీ వర్షాలతో చిగురుటాకులా వణికిపోయింది. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ముంబై నగరంలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. రోడ్లు వరదనీటితో నిండిపోవడంతో ప్రజలు ట్రాఫిక్ కష్టాలతో నరకయాతన అనుభవించారు. భారీ వర్షాలకు పలు రైళ్లు, విమానాలు రద్దు అయ్యా యి. ఆగస్టు 21 వరకు ముంబైలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
అత్యవసరం అయితే తప్పా ముంబై నగరంలోని పౌరులెవరూ బయటకు రావద్దని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) పౌరులకు సూచించింది. విమాన ప్రయాణాలు చేసే వారు ముందుగా విమానా శ్రయాలకు చేరుకోవడంతో పాటు విమానం బయల్దేరే సమయాన్ని తనిఖీ చేసుకోవాలని విమానయాన సంస్థలు సూచించాయి. మం గళవారం కూడా ముంబై నగరానికి రెడ్ అలర్ట్ జారీ అయింది.
పాఠశాలలు బంద్..
ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేయడంతో నగరంలోని పలు పాఠశాలలకు సెలవులు ప్రక టించారు. స్కూళ్లతో పాటు కళాశాలలకు కూడా సెలవులు మంజూరు చేశారు. ట్రాఫిక్ పోలీసులు వరద సహాయక చర్యలు చేపట్టారు. వరదనీటిలో చిక్కుకుపోయిన వాహ నాలు, వ్యక్తులకు సహాయం చేశారు. ఓ స్కూ ల్‌కు చెందిన బస్సు కూడా వరదనీటిలో చిక్కుకుపోగా పోలీసులు సాయం చేసినట్టు అధికారులు తెలిపారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల పాఠశాలలకు సెల వు ప్రకటించిన అనంతరం బస్ విద్యార్థులను తీసుకుని వెళ్తుండగా.. ఈ ఘటన చో టు చేసుకుంది. గడిచిన ఏడెనిమిది గంటల్లో ముంబై నగరంలో 177 మి. మీ వర్షం కురిసినట్టు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. భారీ వర్షాలకు ఎక్కడికక్కడ ట్రా ఫిక్ జామ్ కావడంతో ప్రజలు మెట్రలోనే ప యనిస్తున్నారు.