calender_icon.png 19 August, 2025 | 2:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హత్య కేసులో నిందితుల అరెస్టు

19-08-2025 12:39:34 AM

బూర్గంపాడు,ఆగస్టు18,(విజయక్రాంతి):ఇటీవల జరిగిన ఓ హత్య కేసులో ఇద్దరు నిందుతులను సీఐ నాగరాజు ఆదేశాలతో ఎస్‌ఐ మేడా ప్రసాద్ అరెస్ట్ చేసి విలేకరుల ముందు సోమవారం ప్రవేశపెట్టారు. ఈ ఘటనకు సంబంధించి పాల్వంచ ఇంచార్జ్ సీఐ నాగరాజు తెలిపిన వివరాలు ప్రకారం మృతుని తల్లి భద్రాచలం కు చెందిన కడియం రమణమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకుమల్లెల మడుగు గ్రామం

అశ్వాపురం మండలానికి చెందిన మృతుడు కడియం సర్వేశ్వరరావు (32) ఈనెల 11వ తేదీ రాత్రి సుమారు 12 గంటలకు మోతె గ్రామంలో ఎస్ కె జావేద్ ఇంటి ముందర మృతుడు కడియం సర్వేశ్వరరావుతో టేకులపల్లి మండలం బొమ్మనపల్లికి చెందిన నిందితుడు శివ ఇంటిదగ్గర గ్యాస్ సిలిండర్ చెప్పకుండా తెచ్చాడని కారణంతో నిందితులు కొండల సంతోష్, చర్లపల్లి శివలు గొడవ జరగగా ఈ గొడవలో నిందితులు ఇద్దరు కలిసి సిమెంటు డంబెల్ తో మృతిని తలపై కొట్టగా మృతుడు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ 16వ తేదీన చనిపోయాడని తెలిపారు. కాగా మృతుని తల్లి రమణమ్మ ఫిర్యాదు మేరకు కేసు చేసి దర్యాప్తు చేయగా దర్యాప్తులో భాగంగా నిందితుల ఇద్దరినీ అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్లు తెలిపారు.