19-08-2025 12:00:00 AM
కాంగ్రెస్ అనుబంధ సంఘాలు
ముషీరాబాద్, ఆగస్టు 18 (విజయక్రాం తి): జలమండలిలో కారుణ్య నియామకాలు చేపట్టి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని తెలంగాణ జలమండలి ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు సి. సతీష్ కుమార్, హైదరాబాద్ వాటర్ వర్క్స్ అండ్ సీవరేజ్ కంగర్ యూనియన్ అధ్యక్షుడు మొగుళ్ళ రాజిరెడ్డి, ట్రేడ్ యూనియన్ సీనియర్ నాయకులు తెలంగాణ వాటర్ వరక్స్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు కళ్లెం రాజ్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు సోమవారం హైదరాబాద్ జలమండలి కార్యాలయంలో జలమండలి మేనేజిం గ్ డైరెక్టర్ అశోక్ రెడ్డిని తెలంగాణ జలమండలి ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు సి. సతీష్ కుమార్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ట్రేడ్ యూనియన్ సీనియర్ నాయ కులు తెలంగాణ వాటర్ వరక్స్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు కళ్లెం రాజ్ రెడ్డి తదితరులు కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అల్లి శ్రవాన్ కుమార్, ఎండీ. జాంగిర్, బి.దేవేందర్, సైద్ అక్తర్ అలీ, భూమయ్య సీతయ్య సి.రాజు, కె.ఆనం ద్ రెడ్డి, అజయ్ నాథ్, లక్ష్మణ్ యాదవ్, గౌస్ పాషా, బి.మహేష్ తదితరులు పాల్గొన్నారు.