calender_icon.png 19 August, 2025 | 2:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేపల వేటకై వెళ్లి యువకుడి గల్లంతు

19-08-2025 12:26:58 AM

దాదాపు మూడు గంటల నుండి కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్

చీకటి పడిన సెర్చ్ ఆపరేషన్ లో పోలీస్, రెవిన్యూ, ఫైర్ సిబ్బంది

వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండలంలోని వెలువర్తి గ్రామం వద్ద చేపల వేటకై వెళ్లి గల్లంతైన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే మండలంలోని వెలువర్తి గ్రామం చెరువులో నుండి అలుగు వరద వలిగొండ -వెలువర్తి గ్రామాల మధ్య గల కాజ్ వే వద్ద పెద్ద ఎత్తున ప్రవహిస్తుంది. అయితే మోత్కూర్ మండలంలోని పాలడుగు గ్రామానికి చెందిన శివరాత్రి నవీన్ అనే యువకుడుతో పాటు మరో ఇద్దరు సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో చేపలు పట్టేందుకు రావడం జరిగింది. ఈ క్రమంలో నవీన్ చేపలు పడుతుండగా వరద ఉధృతికి కొట్టుకపోవడం జరిగింది. వెంటనే అతని మిత్రులు వెలువర్తి గ్రామస్తులకు మరియు తమ వారికి తెలియజేయడంతో  వెతకడం ప్రారంభించారు. విషయం తెలుసుకున్న వెంటనే స్థానిక ఎస్ ఐ యుగేందర్ గౌడ్, తహసిల్దార్ దశరథ తన సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టారు. వర్షం కురుస్తున్నప్పటికీ దాదాపు 3 గంటల పాటు గాలింపు చర్యలు కొనసాగిస్తూనే ఉండగా ఫైర్ సిబ్బంది సైతం సంఘటన స్థలానికి చేరుకొని సెర్చ్ ఆపరేషన్ లో పాల్గొన్నారు. చీకటి పడినప్పటికీ పోలీస్, రెవిన్యూ, ఫైర్ సిబ్బందిచే సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది.