19-08-2025 12:00:00 AM
నాగర్ కర్నూల్ ఆగస్టు 18 విజయక్రాంతి అల్పపీడన ప్రభావంతో మరో మూడు రోజులు ము సురు వర్షాలు తప్పేలా లేదని జిల్లా అధికారులంతా ఆస్తి నష్టం ప్రాణ నష్టం, అవాంఛనీ య ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ అధికారులను అప్రమత్తం చేశారు. సోమవారం జిల్లాలోని ఆయా చెరువులు, కుంటలు ఉప్పొంగుతున్న వాగులను పరిశీలించారు.
ఆయా నియోజకవర్గాల్లో డివిజన్ స్థాయి అధికారులంతా ప్రధాన రహదారుల వెంట ప్రవహిస్తున్న వరద తీవ్రతను సందర్శించి జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. కూలేందుకు సిద్ధంగా ఉన్న పాత ఇల్లు, పాఠశాలలను ఖాళీ చేయాలని అవసరమైతే సెలవులు ప్రకటించాలని సూచించడంతో సోమవారం జిల్లాలో 18 పాఠశాలలకు రోజు సెలవు ప్రకటించారు. ఆదివారం అర్ధరాత్రి భారీగా కురిసిన వర్షానికి చెరువులు కుంటలు ఉప్పొంగుతూ వాగుల వెంట వరద నీరు ప్రవహించడంతో ఆయా ప్రధాన రహదారుల వెంట రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
వాటి వద్ద రక్షణ చర్యలు ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టరేట్లోని ప్రజావాణి హాల్లో ప్రజల నుంచి వచ్చిన వినతులను జిల్లా కలెక్టర్ స్వీకరించార. ఈ సందర్భంగా ప్రజావాణి పట్ల జిల్లా అధికారులు అలసత్వం ప్రదర్శించడం సరైనది కాదన్నారు. ప్రజావాణి కి తప్పనిసరిగా జి ల్లా అధికారులంతా హాజరు కావాల్సిందేనని లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం జిల్లా వ్యవసాయ శాఖ అధికారులతో యూరియా కొరత అంశంపై సమీక్ష జరిపారు. యూ రియా ప్రతి రైతుకు అందేలాచూడాలన్నారు.