calender_icon.png 25 July, 2025 | 8:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజాసింగ్ మిస్డ్ కాల్ ఇస్తే సభ్యత్వం తిరిగి వస్తుంది

24-07-2025 01:01:27 AM

ఢిల్లీలో బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్

హైదరాబాద్, జూలై 23 (విజయక్రాంతి): గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీలో కొన్ని విషయాల్లో మనస్తాపం చెందారని.. ఆయన్ను పార్టీ సస్పెండ్ చేయలేదని, ఆయనే రాజీనామా చేశారని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీలో మిస్డ్ కాల్ ఇస్తే సభ్యత్వం వస్తుందని.. అది ఇప్పుడు రాజాసింగ్‌కు కూడా వర్తిస్తుందని తెలిపారు.

బండి సంజయ్ ఈటల రాజేందర్ వ్యవహారంపై తటస్థ కమిషన్‌ను ఏర్పాటు చేసి విచారణ జరిపించాలన్నారు. పార్టీ పెద్దలు జోక్యం చేసుకోవాలని కోరారు. ఇన్నా ళ్లు కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఎందుకు రిజర్వేషన్ ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు.

బీసీ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టులో కొట్లాడాలని సూచించారు. అర్వింద్ తెలంగాణ సీఎం అవుతారా అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. బీజేపీలో కుల రాజకీయాలు ఉండవని స్పష్టం చేశారు. బీసీ నాయకుడైన శివరాజ్‌సింగ్ చౌహాన్ 20 ఏళ్లు సీఎంగా ఉన్నారని గుర్తు చేశారు.