calender_icon.png 25 July, 2025 | 8:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జర్నలిజంలో విప్లవాత్మక మార్పులు

24-07-2025 01:00:14 AM

- మారుతున్న కాలానికి అనుగుణంగా జర్నలిస్టులకు శిక్షణ

- రానున్న రోజుల్లో డిజిటల్ మీడియా కీ రోల్

- మీడియా అకాడమి చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి

 రంగారెడ్డి, జులై 23( విజయ క్రాంతి ): జర్నలిస్టులో నిత్య విద్యార్థిగా సమాజాన్ని పరిశీలిస్తూ ఉండాలని.... అప్పుడే సమాజం లో జర్నలిస్టులకు మంచి గుర్తింపు లభిస్తుందని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. జర్నలిజంలో విప్లవా త్మక మార్పులు వస్తున్నాయని.... దానికనుగుణంగానే జర్నలిస్టులు సైతం అ ప్డేట్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన గుర్తు చేశారు. బుధవారం నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమీ భవ నంలో రంగారెడ్డి జిల్లా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు నిర్వహిస్తున్న రెండు రోజులపాటు శిక్షణ తరగతుల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్తల సేకరణలో సా మాజిక ప్రభావం వంటి అంశాలు పూర్తిగా కొత్త రూపం దాల్చాయని ఆయన తెలిపా రు. ప్రస్తుతం డిజిటల్ మీడియా రంగంలో సాంకేతికతతో వేగంగా వార్తల సేకరణ సుల భం అవుతుంది తెలిపారు. మారుతున్న కా లానికి అనుగుణంగా జర్నలిస్టుల కు కావలసిన శిక్షణ ఇవ్వడానికి మీడియా అకాడమి అన్ని చర్యలను చెప్పటి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. శిక్షణ కోసం ఎవరు దరఖాస్తు చేసుకున్న వారికి శిక్షణ ఇవ్వనున్నామని చెప్పారు. ఈ సందర్భంగా ప్రముఖ సంపాదకులు కే శ్రీనివాస్ మాట్లాడుతూ, తె లంగాణ జర్నలిజం గతం, వర్తమానం, భవిష్యత్తు - మీడియా ధోరణులు, ఆధునిక యు గంలో మీడియాలో వస్తున్న మార్పుల గు రించి వివరించారు.

సోషల్ మీడియా యూ ట్యూబ్‌లో వస్తున్న వార్తలు క్షణాల్లో ప్రజల్లో వెళ్తున్నాయని అయితే ఆ వార్తలు విశ్వసించాలా వద్దా అనేది కొంత ప్రజల్లో అ యోమయం నెలకొంది అన్నారు. ఫ్రంట్ మీ డియాలో ప్రజలు విశ్వసించే వార్తలను ప్ర చురితం చేసేందుకు ఒక సిస్టం.... ఒక లేయర్ ఉండడంతోనే పాఠకుల్లో ఇంకా రెడ్డి మీద పై ఆదరణ పెరుగుతుందన్నారు. ప్రింట్ మీడి యా సైతం అప్డేట్ అవుతూ డిజిటల్ వైపు దృష్టి సారించాలన్నారు. సీనియర్ జర్నలిస్ట్ ఉడుముల సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, ఫేక్ న్యూస్, సైబర్ క్రైమ్, సోషల్ మీడియా, ఫ్యాక్టు చెక్, మొదలగునవి టెక్నికల్ గా ఏలా ఉపయోగించాలో జర్నలిస్టులకు సవివరంగా తెలియజేశారు. సీనియర్ జర్నలిస్ట్ గో వింద్ రెడ్డి మాట్లాడుతూ, నేర వార్తల సేకరణ లో తీసుకోవలసిన జాగ్రత్తలు, చట్టాలపై అవగాహన ఉండాలని, వార్తలు సేకరించే ముందు నిజనిర్ధారణ చేసుకొని చేసుకుని వ్రాయాలని ఆయన సూచించారు, అలాగే నేర వార్తలు లలో చేయాల్సినవి చేయకూడనివి అంశాలపై క్లుప్తంగా వివరించారు.

సీనియర్ జర్నలిస్ట్ దిలీప్ రెడ్డి మాట్లాడు తూ, సమాచార హక్కు చట్టం- 2005 గురిం చి సమగ్రంగా వివరించి జర్నలిస్టుల సందేహాలను నివృత్తి చేశారు.  శిక్షణ కార్యక్రమం లో మీడియా అకాడమీ కార్యదర్శి ఎన్. వెం కటేశ్వర రావు,ఐజేయూ కార్యదర్శి వై నరేందర్ రెడ్డి, నాయకులు మాజీద్ ,టీయూడ బ్ల్యూజె రాష్ట్ర కార్యదర్శి కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి,జిల్లా అధ్యక్షులు సలీమ్ పాషా,కార్యదర్శి మేకల సత్యనారాయణ, రంగారెడ్డి జిల్లా డిపిఆర్‌ఓ పి.సి. వెంకటేశం, మేనేజర్ శైలేశ్వర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా ప్రింట్ మీడియా స్టాఫ్ రిపోర్టర్లు ఈర్లపల్లి పాండు, గంజి ప్రదీప్, జంగయ్య ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు, తదితరులు పాల్గొన్నారు.