04-09-2025 12:33:23 AM
మౌళి తనుజ్, శివానీ నాగరం లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘లిటిల్ హార్ట్స్’. దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించిన ఈ సినిమాకు డైరెక్టర్ ఆదిత్య హాసన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హీరో శ్రీవిష్ణు ముఖ్యఅతిథిగా హాజరరై మాట్లాడారు. “మీమర్స్ వల్లే మన స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. వాళ్ల మధ్య నుంచి వచ్చిన డైరెక్టర్‌కు మీమర్స్ సపోర్ట్ ఉండాలి” అన్నారు.
హీరో మౌళి తనూజ్ మాట్లాడుతూ.. “నేను ఎప్పుడో ఎవరినో ఏదో అన్నానని, వారి మీద కామెంట్ చేశానంటూ ‘లిటిల్ హార్ట్స్’కి నెగిటివ్ చేస్తున్నారు. మీకు వార్నింగ్ ఇస్తున్నా.. మిమ్మల్ని మా మూవీ ద్వారా నవ్విస్తా. మీ మనసులు గెలుచుకుంటా. థియేటర్స్‌కు రావాలని కోరుతున్నా” అన్నారు. హీరోయిన్ శివానీ నాగరం మాట్లాడుతూ.. “మార్నింగ్ షో చూసిన వాళ్లు తప్పకుండా ఈవెనింగ్ షోకు ఫ్యామిలీతో వెళ్తారు” అని తెలిపింది. చిత్రబృందం పాల్గొన్నారు.