calender_icon.png 4 September, 2025 | 3:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రపంచస్థాయి కంటెంట్ దక్షిణాది నుంచే వస్తోంది

04-09-2025 12:36:37 AM

శివ కార్తికేయన్, రుక్మిణి వసంత్, విద్యుత్ జమ్వాల్ ప్రధాన పాత్రల్లో ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించిన చిత్రం ‘మదరాసి’. ఈ మూవీ సెప్టెంబర్ 5న విడుదల కానుంది. తెలుగులో ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మీ మూవీస్ బ్యానర్‌పై రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో దర్శకుడు మురుగదాస్ చిత్ర విశేషాల్ని పంచుకున్నారు.  

* నేను ప్రతీ సినిమాను మొద టి సినిమాగానే భావిస్తా. ‘మదరాసి’ విషయంలోనూ అ లాంటి ఫీలింగ్‌తోనే ఉన్నా. డి ఫరెంట్ కథతో అందరి ముం దుకు రాబోతోన్నా. ఈ మూ వీ అందరినీ ఆకట్టుకుంటుందనే కాన్ఫిడెంట్‌తో ఉన్నా.

* మామూలుగా మన దక్షిణాది వారిని ఉత్తరాదిలో మదరాసి అని పిలుస్తుంటారు. ఈ చి త్రం ఎక్కువగా విలన్ పా యింట్ ఆఫ్ వ్యూలో సాగుతుంది. విలన్ ఈ మూవీ లోని హీరోని మదరాసి అని పిలుస్తుంటాడు. కథ మొత్తం తమి ళనాడు నేపథ్యంలో సాగుతుంది. అందుకే టైటిల్ కూడా ‘మదరాసి’ అని పె ట్టాం. ఇందులోని కంటెంట్, కథ అన్ని ప్రాంతాలకు కనెక్ట్ అవుతుంది.

* వెస్ట్రన్ కంట్రీస్‌లో ఆల్రెడీ ఉన్న సమస్యలు మన దేశంలోకి వస్తున్న ఇలాంటి ఓ కొత్త సమస్యను బేస్ చేసుకుని ఈ కథను రాసుకున్నా. ఇందులోని సబ్జెక్ట్ చాలా డిఫరెంట్‌గా, కొత్తగా ఉంటుంది. అందరూ తెలుసుకోవాల్సిన పాయింట్ అనుకుని ఈ మూవీని తెరకెక్కించాను.

* ఇందులో హీరో పాత్ర చాలా డిఫరెంట్‌గా, కొత్తగా ఉంటుంది. ప్రస్తుతం శివ కార్తికేయన్‌కు మాస్‌లో మంచి ఇమేజ్ పెరిగింది. ఈ పాయింట్‌ను అలాంటి మాస్ హీరోతో చెబితేనే ఎక్కువ రీచ్ అవుతుంది. రుక్మిణి వసంత్ పాత్ర కూడా చాలా రియలిస్టిక్‌గా ఉంటుంది.  

* విద్యుత్ జమ్వాల్ ప్రస్తుతం హీరోగా సినిమాలు చేస్తున్నారు. ఒక హాలీవుడ్ ప్రాజెక్ట్‌ను కూడా చేస్తున్నారు. ‘మదరాసి’ కథను చెప్పిన వెంటనే చాలా నచ్చడంతో విలన్‌గా చేసేందుకు ఒప్పుకున్నారు. సెకండాఫ్‌లో హీరో, విలన్ మధ్య వచ్చే యాక్షన్ ఘట్టాలు ప్రేక్షకులను అబ్బురపరుస్తాయి.

* దక్షిణాది ప్రేక్షకులు సినిమాను ఎక్కువగా ప్రేమిస్తారు. ఓ నలుగురు కలిస్తే కచ్చితంగా సినిమా గురించి మాట్లాడుకుంటారు. మన దగ్గర నుంచి ప్రస్తుతం ప్రపంచ స్థాయి కంటెంట్ వస్తోంది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతోంది.