09-09-2025 04:55:50 PM
గ్రామ పంచాయతీల్లో క్యాంపులు మృగ్యం
ఖానాపూర్ (విజయక్రాంతి): సేవింగ్స్ ఖాతాదారులకు అవగాహన లేక, వినియోగదారులు కేవైసీ అప్డేట్ చేసుకోలేక నానా అవస్థలు పడుతున్నట్టు తెలుస్తోంది. కాగా బ్యాంకు ఖాతాదారులు విధిగా కేవైసీ అప్డేట్ ఎప్పటికప్పుడు చేసుకోవాలని నిబంధన ఉండడం వల్ల వినియోగదారులు ఖాతాల నుంచి అనేక సేవల విషయంలో తిప్పలు ఎదుర్కొంటున్నారు. దీని విషయమై సాధారణ ప్రజల్లో సరైన అవగాహన కల్పించకపోవడంతో కేవైసీ అప్డేట్ చేయించుకోవడం నిర్లక్ష్యం చేస్తున్నారు. అకస్మాత్తుగా ఖాతాలో ఏదైనా పని పడినప్పుడు ఎకౌంటు కేవైసీ అడుగుతుంది కాగా జాతీయ బ్యాంకుల్లో ఖాతాదారులు ఈ ప్రక్రియ ఎక్కడ చేస్తారో తెలియక సతమతమవుతున్నారు.
వినియోగదారులు మీసేవ, బ్యాంకుల వినియోగదారుల సేవ కేంద్రాలు, బ్యాంకు బ్రాంచీల, చుట్టూ తిరుగుతూ అవస్థలు పడుతున్నారు .కాగా ఆయా శాఖల వారు గ్రామపంచాయతీలో క్యాంపులు నిర్వహించి ఈ ప్రక్రియ చేయాల్సి ఉండగా ఇంతవరకు ఎక్కడా కూడా గ్రామపంచాయతీలో, మున్సిపాలిటీల్లో అటువంటి ప్రక్రియ జరిగినట్లు కనిపించకపోవడం గమనార్హం. ఈ విషయం ప్రజల్లో అవగాహన చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అబిప్రాయ పడుతున్నారు. జూలై 1 నుండి సెప్టెంబర్ 30 వరకు అప్డేట్ చేయించుకోవాలని సమాచారం.