calender_icon.png 9 September, 2025 | 10:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపటి నుంచి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు

09-09-2025 04:53:38 PM

- విలీన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి

- సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్

మంచిర్యాల, (విజయక్రాంతి): ఈ నెల 11 నుంచి 17వ తేదీ వరకు నిర్వహించే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను విజయవంతం చేయాలని, విలీన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలనీ సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్(CPI District Secretary Ramadugu Lakshman) కోరారు. మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాస్ తో కలిసి ఆయన మాట్లాడారు. గ్రామస్థాయి నుంచి పట్టణ, మండల కేంద్రాలలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను నిర్వహిస్తూ, సాయుధ పోరాట చరిత్రను అమరవీరుల త్యాగాలను సెమినార్లు సదస్సులు సమావేశాలు నిర్వహించి నేటి సమాజానికి తెలిసే విధంగా ఏర్పాటు చేయాలన్నారు. ఈ నెల 17 ముగింపు సభ హైదరాబాద్, రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో  జరగనుందని, ఈ సభకు పార్టీ, ప్రజా సంఘాల శ్రేణులు జిల్లా వ్యాప్తంగా పాల్గొనాలనీ కోరారు.

స్వాతంత్రం కోసం తెలంగాణ రైతంగ సాయుధ పోరాటం కోసం ఏనాడు బిజెపి గానీ, ఆర్ఎస్ఎస్ గాని పోరాటంలో పాల్గొనలేదని, ఆ చరిత్ర వారికి తెలియదన్నారు. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ సాయుధ పోరాట దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని, సాయుధ పోరాట చరిత్రను అమరవీరుల త్యాగాలను పాఠ్యపుస్తకాలలో చేర్పించి నేటి సమాజానికి తెలిసే విధంగా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు జోగుల మల్లయ్య, ఇప్పకాయల లింగయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు, కళిందర్ అలీ ఖాన్, లింగం రవి, జిల్లా సమితి సభ్యులు, మిట్టపల్లి పౌలు, దేవి పోచన్న, చాడ మహేందర్ రెడ్డి, కుంచాల శంకరయ్య, కాదండి సాంబయ్య, పూజారి రామన్న, ఎగుడ మొండి, నాయకులు, నరసయ్య, రాయమల్లు, తదితరులు పాల్గొన్నారు