calender_icon.png 9 September, 2025 | 10:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్ర మంత్రులను కలిసిన కామారెడ్డి ఎమ్మెల్యే

09-09-2025 04:51:47 PM

భారీ వర్షాలు, వరదలు వల్ల కామారెడ్డి అతలాకుతలం

కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు నియోజకవర్గంలో జరిగిన వరద నష్టాన్ని కేంద్ర మంత్రులకు వివరించిన ఎమ్మెల్యే 

వరద బాధితులకు నష్టపరిహారం కేటాయించి ఆదుకోవాలని వినతి 

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డిలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల భారీ వరదలు వచ్చి ఎంతోమంది నిరాశ్రయులు సర్వం కోల్పోయిన విషయాలని మంగళవారం ఢిల్లీకి వెళ్లిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి కేంద్ర మంత్రులను కలిసి నష్టం వివరాలను వివరించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy), కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల మంత్రి నితిన్ ఘట్కారిని కలిసి వరదల వల్ల దెబ్బతిన్న రోడ్లు వందనాలు చాలా దారుణంగా ఉన్నాయని ప్రత్యేకంగా నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఔటర్ రింగ్ రోడ్డు కావాలని వాటికి సంబంధించిన ప్లాన్ మ్యాపులు డిపిఆర్ అంచనా వేయాన్ని వివరించారు.

సుమారు 510 కోట్లతో 54 కిలోమీటర్ల పొడవు గల ఔటర్ రింగ్ రోడ్డు కామారెడ్డి పట్టణం చుట్టూ అవసరముందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి సానుకూలంగా స్పందించారు. కేంద్ర సాంస్కృతిక పర్యాటక ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి ని కలిసి ప్రకృతి విపత్తు కింద సాధ్యమైనంత కామారెడ్డికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. మరో మంత్రిని కలిసి కామారెడ్డి పరిస్థితిని వివరించారు. ఎంతోమంది ప్రజలు నిరాశ్రయులయ్యారని వారికి ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలని కోరారు.