calender_icon.png 9 September, 2025 | 9:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ప్రజాకవి కాళోజీ జయంతి

09-09-2025 04:43:49 PM

వలిగొండ (విజయక్రాంతి): పుట్టుక నీది చావు నీది బతుకుతా దేశానిది అని చాటిన ప్రజాకవి, పద్మ విభూషణ్ కాళోజి నారాయణ రావు జయంతిని మంగళవారం ఎంపీడీవో, తహసిల్దార్ వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో కాళోజి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో జలంధర్ రెడ్డి(MPDO Jalander Reddy), తహసిల్దార్ దశరథ మాట్లాడుతూ... తెలంగాణ సమాజాన్ని తన కవితలతో జాగ్రత్త చేసిన గొప్ప వ్యక్తి అని, ఒక సిరా చుక్క లక్షల మెదళ్లకు కదలిక అని చాటిన గొప్ప కవి అని ఆయన జీవితం నేటి యువతరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. తెలంగాణ భాష, యాస గురించి తపించిన వ్యక్తి కాళోజీ అని ఆయన జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకోవడం గర్వించదగ్గ విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో డిటి పల్లవి కర్ణాకర్ రెడ్డి, నగేష్, మనోహర్ నాగరాజు,  నిరంజన్, రాధా కుమార్ తదితరులు పాల్గొన్నారు.