calender_icon.png 9 September, 2025 | 9:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికైన పిఈటి కి ఘనంగా సన్మానం

09-09-2025 04:41:41 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): తాండూర్ మండలంలోని అచ్చులాపూర్ జిల్లా పరిషత్ హై స్కూల్ లో పనిచేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయులు ఏ. సాంబమూర్తి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికవడంతో మంగళవారం ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు పి.ఉమాదేవి మాట్లాడుతూ, గత సంవత్సరం విధుల్లో చేరిన వ్యాయామ ఉపాధ్యాయులు సాంబమూర్తి విద్యార్థులందరినీ క్రీడల్లో తీర్చిదిద్దారన్నారు. విద్యార్థులకు చక్కని క్రమశిక్షణ అందించారని, తన వృత్తి పట్ల అంకిత భావంతో పనిచేస్తూ విద్యార్థులు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో రాణించేలా కృషి చేశారని తెలిపారు. విద్యార్థులందరికీ తన సొంత ఖర్చులతో టై, స్కూల్ బెల్టులను అందించి సేవ భావాన్ని చాటారని అభినందించారు. ఉపాధ్యాయులు సాంబమూర్తిని సన్మానించిన వారిలో ఎంఈఓ మల్లేశం, ఉపాధ్యాయులు డి. రాజేశ్వరరావు, భాస్కర్ ,సుధాకర్, శ్రీనివాస్ గౌడ్, సురేందర్, రమాదేవి, డి .శ్రీనివాస్, ఏ ఏ పీ సి చైర్మన్ చిలకమ్మ, తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు.