27-05-2025 12:00:00 AM
హైదరాబాద్, మే 26 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో ఎంఈవోలే కీలకమని, విద్యార్థుల నమోదును పెంచేందుకు వారు కృషి చేయాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈవీ నర్సింహారెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలోని ఎంఈవోలకు రెసిడెన్షియల్ శిక్షణా కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి పాఠశాల విద్యా సంచాలకులు నర్సింహారెడ్డి హాజరై మాట్లాడారు.
ఎంఈవోలందరూ పాఠశాలలను సందర్శించి, విద్యార్థుల విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం కో సం కృషి చేయాలని సూచించారు. -గతంతో పోలిస్తే ప్రస్తుతం ప్రతీ మండలానికి ఒక ఎంఈవో ఉన్నారని, ప్రభుత్వ పాఠశాలలపైన నమ్మకం పెరిగేలా పనితీరు ఉండా లన్నారు.
-బడిబాట కార్యక్రమంలో ప్రతీ ఎంఈవో ఒక ప్రత్యక కార్యాచరణతో వారి మండలంలో ఉన్న పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేవిధంగా కృషి చేయాలని ఆదేశించారు. ఇప్పటికే టీచర్లకు శిక్షణా కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నామన్నారు. ఎంఈవోలకు ఈనెల 26 నుంచి జూన్ 3 వరకు శిక్షణ ఇవ్వనున్నట్టు ఆయన తెలిపారు.