calender_icon.png 13 July, 2025 | 8:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ కార్మికులకు కోటి ప్రమాద బీమా

27-05-2025 12:00:00 AM

దేశ చరిత్రలోనే రికార్డు: డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్, మే 26 (విజయక్రాంతి): విద్యుత్ కార్మికులకు కోటి రూపాలయలకు పైబడి ప్రమాద బీమా అందించడం దేశ చరిత్రలోనే రికార్డని రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పేర్కొన్నారు. ఎన్పీడీసీఎల్ పరిధిలో విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన జోగు నరేశ్ కుటుంబ సభ్యులకు సోమవారం ప్రజాభవన్‌లో రూ. కోటి ప్రమాదబీమా చెక్కుతో పాటు విద్యుత్‌శాఖలో నరేశ్ సతీమణికి కారుణ్య నియామక ఉత్తర్వులు అందజేశారు.

ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ విద్యుత్ కార్మికునికి కోటి రూపాయల ప్రమాద బీమా చెక్కులను అందించడం కేవలం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వంలోనే సాధ్యమైందన్నారు. గతంలో కార్మికుల కోసం ఏ ప్రభుత్వం ఇంత గొప్పగా ఆలోచన చేయలేదన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు.

కార్మికులకు ప్రమాద బీమా పథకాన్ని మొదట సింగరేణిలో ప్రవేశపెట్టి అనంతరం విద్యుత్ సంస్థల్లోనూ ఆచరణలోకి తీసుకొచ్చిన విషయాన్ని భట్టి గుర్తుచేశారు. విద్యుత్ ఉద్యోగులు అంకితభావంతో రాష్ట్ర ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు.

ప్రభుత్వ ఆలోచనను సమర్థవంతంగా అమలు చేసి ఎన్పీడిసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డిని ఈ సందర్భంగా భట్టి విక్రమార్క అభినందించారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, విద్యుత్, బ్యాకింగ్ రంగ ఉన్నతాధికారులు పాల్గొన్నారు