calender_icon.png 19 December, 2025 | 7:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూములను కబ్జా చేసిన చెరువు!

18-12-2025 12:00:00 AM

అమీన్ పూర్ పెద్దచెరువు బాధితుల నిరసన

ముషీరాబాద్, డిసెంబరు17 (విజయక్రాంతి): తమ భూములను చెరువు కబ్జా చేసిందంటూ అమీన్ పూర్ పెద్దచెరువు బాదితులు ఆరోపించారు.  గతంలో తమకు భూములు అమ్మిన పట్టాదారుల భూమిని అమీన్ పూర్ పెద్ద చెరువు కబ్జా చేసిందని, అధికారుల బాధ్యత రాహిత్యం వల్ల 33 ఎకరాల ఆమీన్ పూర్ పెద్ద చెరువు నేడు 450 ఎకరాలకు విస్తరించిందని  ఆరోపించారు. చెరువుకు ఉన్న అలుగులు మూసి వేసి పెద్ద పెద్ద వ్యాపార వేత్తలు బహుళ అంతస్తులు నిర్మించారని, పారిశ్రామిక వ్యర్ధాలతో, డ్రైనేజీ మురుగు నీరు చెరువులో పేరుకుపోతుందని ఆరోపించారు.

ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, హైడ్రా అధికారులు జోక్యం చేసుకొని దాదాపు 5 వేల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తమ భూములను చెరువు కబ్జా చేసిందంటూ అమీన్ పూర్ పెద్దచెరు వు బాడితులు బుధవారం ఇందిరాపార్కు ధర్నా చౌక్లో పెద్దఎత్తున ప్ల కార్డులతో నిరసన వ్యక్తం చేశారు.

ఈ నిరసన కార్యక్రమంలో అమీన్ పూర్ పెద్దచెరువు బాధితుల జాయింట్ యాక్షన్ కమిటి నేతలు స్వర్ణశ్రీ, ప్రమీల, కృష్ణంరాజు, నర్సింగ్ రావు, సాంబయ్య, పీరహ్మద్ లు మాట్లాడుతూ తాము అనేక సంవత్సరాల క్రితం భూములు కొన్న సమయంలో 98 ఎకరాలలో ఉన్న అమీన్ పూర్ పెద్దచెరువు నేడు 450 ఎకరాలకు విస్తరించిందని ఆరోపించారు. ఆమీన్ పూర్ పెద్దచెరువు చుట్టుపక్కల ఉన్న పారిశ్రామిక వ్యర్థాలు, డ్రైనేజీ మురుగునీరును చెరువులో కలపడంతో చెరువు రోజురోజుకు విస్తరించి తమ స్థలాలలు కనుమరుగయ్యాయని వారు అవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం తమ భూములు బఫర్ జోన్ పరిధిలోకి వస్తాయని నిర్మాణాలు చేపట్టకుండా అధికారులు అడ్డుకుంటున్నారని వారు ఆరోపించారు. 1985లో సుమారు మూడువేల మంది స్థలాలు కొనుగోలు చేసిన వారు రోడ్డున పడ్డారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై నాటినుంచి నేటి వరకు అనేక మంది రాజకీయ నాయకులను అధికారులు కలిసి విన్నవించి తమకు న్యాయం చేయాలని కోరినా ఎవరూ పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు.

తమ సమస్యను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏర్పాటు చేసిన హైడ్రా సంస్థ, కమిషనర్ రంగనాథ్ దృష్టికి తీసుకెళ్లామని ఆయన న్యాయం చేస్తామని హామి ఇచ్చారని పేర్కొన్నారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ లు స్పందించి తమ భూములు తమకు వచ్చేలా అధికారులను ఆదేశించి దాదాపు ఐదువేల మంది బాది తులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.