calender_icon.png 29 November, 2025 | 1:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వడ్ల కొనుగోళ్లు స్పీడప్ చేయాలి

29-11-2025 01:15:01 AM

  1. ట్యాబ్ ఎంట్రీలో అలసత్వం వద్దు

ఎంట్రీ పూర్తి కాగానే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కావాలి

సివిల్ సప్లై జనరల్ మేనేజర్ అభిషేక్ సింగ్

హుస్నాబాద్, నవంబర్ 28 :వడ్ల కొనుగోళ్లలో ఎటువంటి జాప్యం జరగకుండా చూడాలని రాష్ట్ర సివిల్ సప్లైస్ జనరల్ మేనేజర్ అభిషేక్ సింగ్ అధికారులను ఆదేశించా రు. శుక్రవారం ఆయన సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించా రు. కొనుగోలు ప్రక్రియను నిశితంగా పరిశీలించారు. కేంద్రంలో వడ్ల తూకం, నాణ్యతా పరీక్షలు, లెక్కింపు ప్రక్రియ వేగవంతం కావాలని సూచించారు. రైతులు పండించిన పం టను వారికి ఆర్థికంగా నష్టం కలగకుండా కొ నుగోలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.

ధాన్యం కొనుగోళ్లలో ప్రధానమైన అంశం ట్యాబ్ ఎంట్రీ అని, ఈ ప్రక్రి యలో అధికారులు ఏమాత్రం అలసత్వం వహించకూడదని హెచ్చరించారు. ‘ధాన్యం కొనుగోలు చేసిన రోజునే, పూర్తి వివరాలను ట్యాబ్ ఎంట్రీలో నమోదు చేయాలి. ఈ పని లో జాప్యం జరిగితే, రైతులకు సకాలంలో డ బ్బులు అందవు,‘ అన్నారు. రైతుల పంట డబ్బులను వారికి తక్షణమే చెల్లించాల్సిన అ వసరాన్ని నొక్కి చెప్పారు.

ట్యాబ్ ఎంట్రీ పూర్తయిన వెంటనే, రైతులకు చెల్లించవలసిన నగదు వారి బ్యాంకు ఖాతాల్లో ఎలాంటి జాప్యం లేకుండా జమ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో సంచుల కొరత లేకుండా చూసుకోవాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించడానికి సంబంధించిన అన్లోడింగ్ ప్రక్రియను పర్యవేక్షించాలని సూచించారు.

మిల్లింగ్ విష యంలో మిల్లర్లతో సమన్వయం చేసుకుం టూ, కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యం నిల్వ లు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట ఏఎం ప్రమోద, ఇం ద్రిసా ఏపీఎం శ్రీనివాస్, సీసీ సంపత్, వీవో అధ్యక్షురాలు శ్యామల, వీవోఏ కిరణ్ భాయ్, కమిటీ సభ్యులు రతన్ భాయ్, శ్రీకాంత్, రఘు తదితరులు ఉన్నారు.