calender_icon.png 11 September, 2025 | 7:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాయి మందిరంలో ప్రత్యేక పూజా కార్యక్రమం..

11-09-2025 04:54:40 PM

కోదాడ: కోదాడ మండలం నల్లబండగూడెం గ్రామంలోని సాయి మందిరంలో మౌనిక సంతోష్ దంపతులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ చైర్మన్ నలపాటి నరసింహారావు మాట్లాడుతూ దేవాలయ ప్రాంగణంలో ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమం దాతల సహాయ సహకారాలతో నిర్వహిస్తామని తెలియజేశారు. తమకు సహకరిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అన్నదాతలను ఘనంగా దేవాలయ చైర్మన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ రావు, శ్రీనివాసరావు, శరబేశ్వరరావు, రంగారావు, అర్చకులు సాయి శర్మ భక్తులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.