calender_icon.png 15 August, 2025 | 3:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనురాగ్ యూనివర్సిటీలో హర్ ఘర్ తిరంగా స్వాతంత్య్ర స్ఫూర్తి జ్వాల

15-08-2025 01:29:34 AM

ఘట్ కేసర్, ఆగస్టు 14 : స్వాతంత్య్ర వారోత్సవం సందర్భంగా అనురాగ్ యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్ సెల్ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం కింద గురువారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రదర్శనలో దేశ స్వాతంత్య్రం కోసం జరిగిన పోరాటం, స్వదేశాభిమానుల అచంచల సంకల్పం వంటి అంశాలను విద్యార్థులకు ఎగ్జిబిషన్ రూపంలో పరిచయం చేసారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమం కింద విద్యార్థులు భారత జెండాను పట్టుకొని తీసుకున్న సెల్ఫీలను అప్‌లోడ్ చేయమని కోరారు.

అనంతరం క్విజ్ పోటీ నిర్వహించగా విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈకార్యక్రమంలో ఇంజినీరింగ్ పాఠశాల డీన్ డాక్టర్ వి. విజయ కుమార్, ఫార్మసీ పాఠశాల డీన్ డాక్టర్ వసుధా బక్షి, అనురాగ్ యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్  సెల్ ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ డాక్టర్ మల్లేశ, ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్%--%1 ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రాజేంద్ర కుమార్ మరియు ఫార్మసీ విభాగం కోఆర్డినేటర్ తిరుపతి పాల్గొని విద్యార్థుల ఉత్సాహాన్ని అభినందించారు. అలాగే అనురాగ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సెలర్ డా. అర్చన మంత్రి, రిజిస్టర్ ఇంచార్జి డాక్టర్ ఎ. పద్మనాభరావు, రంగోలి పోటీ మరియు రాఖీ కార్యక్రమాలను వీక్షించి ఇందులో పాల్గొన్న విద్యార్థులను అభినందించారు.