calender_icon.png 15 August, 2025 | 3:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

127 మందికి శౌర్య పురస్కారాలు

15-08-2025 01:28:55 AM

39 మంది ఆపరేషన్ సిందూర్ హీరోలకు పతకాలు

న్యూఢిల్లీ, ఆగస్టు 14: కేంద్ర ప్రభుత్వం 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని త్రివిధ దళాల సిబ్బందికి పతకాలను ప్రకటించింది. 127 శౌర్య పురస్కారాలకు గాను 4 కీర్తి చక్ర, 15 వీరచక్ర పతకాలున్నాయి. ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొని ఎస్-400 యుద్ధ విమానాలు ఆపరేట్ చేసిన వారికి పతకాలు ప్రకటించారు.  ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న మొత్తం 36 మంది వాయుసేన అధికారులకు పతకాలు ప్రకటించారు.

9 వీర్ చక్ర, 1 శౌర్య చక్ర, 26 వాయుసేన మెడల్స్ ఆపరేషన్ సిందూర్ హీరోలకు లభించాయి. నలుగురు వాయుసేన అధికారులు, ఇద్దరు సీనియర్ ఆర్మీ ఆఫీసర్లను సర్వోత్తమ్ యుద్ధ్ సేవా పతకం వరించింది. ముగ్గురు అగ్నివీరులకు శౌర్యచక్ర  కేటాయించారు. మొత్తం మీద 127 శౌర్య చక్ర, 40 విశిష్ట సేవా పతకం, 290 మందిని డిస్పాచెస్‌లో ప్రస్తావించారు. ఆర్మీకి చెందిన వారికే నాలుగు కీర్తి చక్ర పతకాలు వరించాయి. పాకిస్థాన్ మీద దాడులు చేసిన తొమ్మిది మంది వాయుసేన అధికారులకు వీర్ చక్ర పతకాలు ప్రకటించారు.