calender_icon.png 15 August, 2025 | 3:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ ఓటర్ల జాబితా ప్రదర్శించండి

15-08-2025 01:30:16 AM

  1. ఈసీకి సుప్రీం కీలక ఆదేశాలు

బీహార్‌లో 65 లక్షల మంది ఓటర్లను తొలగించిన ఈసీ

జాబితా ప్రదర్శనకు 19 వరకు గడువు

పేపర్లు, రేడియోలు, టీవీల ద్వారా కూడా జాబితా బహిర్గతం చేయాలన్న ఉన్నత న్యాయస్థానం

తదుపరి విచారణ 22కు వాయిదా

న్యూఢిల్లీ, ఆగస్టు 14: బీహార్ ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఉన్నత న్యాయస్థానం గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) సందర్భంగా ఎన్నికల సంఘం (ఈసీ) బీహార్ రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మంది పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించింది. అయితే తొలగించిన 65 లక్షల మం ది వివరాలను ఈ నెల 19లోపు బహిర్గతం చేయాలని అపెక్స్ కోర్టు ఈసీని ఆదేశించింది.

22 నాటికి సంబంధిత నివేదికను తమకు సమర్పించాలని సూచించింది. బూత్ వైజ్ జాబితాను సంబంధిత బూత్‌లలో, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శించాలని ఆదేశించింది. ఎస్‌ఐఆర్ ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై గురువారం విచారణ జరిపిన సుప్రీం పై వ్యాఖ్యలు చేసింది. ఓటర్ల జాబితాలో మరణించిన, వలసవెళ్లిన, ఇతర నియోజకవర్గాలకు తరలిన ఓటర్ల పేర్లను ఎందుకు వెల్లడించలేదని ఈసీని సుప్రీం ప్రశ్నించింది. తొలగించిన 65 లక్షల మందిలో 22 లక్షల మంది మరణించారని ఈసీ తెలపగా.. బూత్ స్థాయిలో ఎందుకు బహిర్గతం చేయలేదని సుప్రీం ప్రశ్నించింది. 

ఆగస్టు 19 డెడ్‌లైన్

బీహార్‌లో ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి తొలగించిన 65 లక్షల మంది ఓటర్ల వివరాలను ఆగస్టు 19లోపు బహిర్గతం చేయాలని కోర్టు ఆదేశించింది. ‘ఓటర్ల జాబితా సవరణ చేసేందుకు ఈసీకి అధికారాలు ఉన్నా యి. రాజకీయ వాతావరణంలో పని చేస్తున్న క్రమంలో నిర్ణయాలు వివాదాస్పదం కావడం సహజం. పార్టీల పోరు మధ్యలో చిక్కుకున్నాం. గెలిస్తే ఈవీఎంలు మంచివని, ఓడి పోతే చెడ్డవని ప్రచారం చేస్తున్నారు’ అని ఈసీ వ్యాఖ్యానించింది.

తొలగించిన 65 లక్షల మం ది ఓటర్ల వివరాలను అన్ని దినపత్రికల్లో ప్రచురించడంతో పాటు రేడియోలు, టీవీల్లో ప్ర సారం చేయాలని సూచించింది. జిల్లా రిటర్నింగ్ అధికారి కార్యాలయాల్లో, బ్లాక్ డెవ లప్‌మెంట్ ఆఫీసుల్లో జాబితా ప్రదర్శించాలంది. 22వ తేదీలోపు నివేదికను తమముం దు ఉంచాలని ఆదేశించింది. తదుపరి విచారణను 22వ తేదీకి వాయిదా వేసింది.