calender_icon.png 1 November, 2025 | 5:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేడ్చల్ పీఎస్ పరిధిలో అర్ధరాత్రి నాకాబంది

31-10-2025 12:00:00 AM

మేడ్చల్, అక్టోబర్30 (విజయ క్రాంతి): మేడ్చల్ పోలీస్ స్టేషన పరిధిలో బుధవారం అర్ధరాత్రి పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, రాత్రి 11 గంటల నుండి  అర్ధరాత్రి  ఒంటిగంట వరకు  నాకా బంది  నిర్వహించారు. ఏసీపీ శంకర్ రెడ్డి ఆద్వర్యంలో మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధి లో నాకాబంధి నిర్వహించారు. ఈ తనిఖీలలో 10వాహనాలు చెక్ చేయగా , సరైన దృవ పత్రాలు లేని 11 వాహనాలు స్వాధీనం చేసుకొని, 2385 చల్లాన్లా వసూలు ,డ్రంకెన్ డ్రైవ్ కేసులు ఒకటి  11చిన్న కేసులు నమోదు చేశారు.

ఈ తనిఖీలు మేడ్చల్ కెఎల్‌ఆర్ శివాజీ విగ్రహం వద్ద నుండి కె ఎల్ ఆర్  వెంచర్, జయ శంకర్ చౌరస్తా వరకు నిర్వహించారు. మేడ్చల్ జోన్ పరిధిలో నిబంధనలు అతిక్రమించి వాహనాలు నడిపిన, డ్రంక్ డ్రైవ్, మైనర్లకు వాహనాలు ఇచ్చిన ,సరైన పత్రాలు లేక వాహనాలు నడిపిన ఖఠిన చర్యలు తప్పవని ఏసీపి శంకర్ రెడ్డి హెచ్చరించారు ఈ నాకాబందిలో మేడ్చల్ ఏసీపీ,  మేడ్చల్ డి.ఐ కిరణ్ , సబ్-ఇన్స్పెక్టర్లు 4గురు ఏఎస్‌ఐలు, సిబ్బంది  మొత్తం 54 మంది పాల్గొన్నారు.