calender_icon.png 12 July, 2025 | 6:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్ధరాత్రి.. అభ్యాగతుడు!

24-08-2024 12:00:00 AM

ఆచార్య మసన చెన్నప్ప :

మన ప్రమేయం లేకుండానే జరిగిపోయే కొన్ని సంఘటనల వల్ల అటు మంచీ, ఇటు చెడూ ఏదైనా జరగవచ్చు. అసలే, అర్ధరాత్రి.. ఆపై అభ్యాగతు డు. ఎవరైనా ఏం చేస్తారో తెలియదు కానీ, ప్రస్తుతం దివంగతురాలైన నా ధర్మపత్ని మాత్రం ఆనాడు అసాధారణ ధైర్యాన్నే ప్ర దర్శించింది. ఆ రకంగా తనలోని మానవత్వాన్ని చాటుకుంది. 

అవి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అధ్యాపకునిగా ప్రవేశించిన రోజులు. సా ధారణంగా కొత్తగా నియమితులైన వారికి వారి శక్తి సామర్థ్యాలను పరీక్షించడానికి వి శ్వవిద్యాలయంలో కొన్ని అదనపు బాధ్యతలను అప్పగిస్తారు. నాకు సికింద్రాబాద్ పీజీ కళాశాలలో ఉద్యోగ బాధ్యతలు ఉన్నప్పటికీ, అదనంగా ఓయూ క్యాంపస్‌లో ‘ఈ హాస్టల్‌కు జనరల్ వార్డెన్ బాధ్యతలు అప్పజెప్పారు. తొమ్మిది సంవత్సరా లపాటు ఆ పనిలో కొనసాగాను. పిల్లల శ్రే యస్సు దృష్ట్యా అది నాకు ఒకింత సంతోషాన్నే మిగిల్చింది. 

ఆ సమయంలోనే జరిగిన అరుదైన సంఘటన ఇది. ఎప్పటికప్పుడు హాస్టల్‌లో చేరే విద్యార్థుల సంఖ్యనుబట్టి కొత్తగా గదు ల నిర్మాణం జరిగేది. అయినా, ఆయా గ దుల్లో పాత విద్యార్థులతోపాటు నాన్ బో ర్డర్స్ కూడా కొందరు అనధికారికంగా ఉం డేవారు. అప్పుడు ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డీఎన్‌రెడ్డి చీఫ్ వార్డెన్‌గా ఉన్నా రు. విద్యార్థులకు ఏ అవసరాలు వచ్చినా వారు ప్రేమతో అన్నింటికీ సానుకూలంగా స్పందించేవారు. ఇది ఇట్లుండగా, ఎవరో (విద్యార్థులే కావచ్చు) ‘హాస్టల్ గదుల్లో నాన్ బోర్డర్స్ ఉన్నారని, వారిని తొలగించాలని’ రిజిస్ట్రార్‌ను కలిశారు. ఆయన పో లీసు రైడింగ్‌కు ఆదేశించారు. ‘పోలీస్ రై డింగ్ ఎప్పుడు, ఏ రోజు జరుగుతుందో’ ఎవరికీ తెలియదు. వార్డెన్ బాధ్యతల్లో ఉన్న నాకూ తెలియన్విరు. 

చాలామంది విద్యార్థులకు ముఖ్యంగా హాస్టల్‌లో చదువుకునే వారికి నా ఇంటి అ డ్రస్ తెలుసు. నేను యూనివర్సిటీకి సమీపంలో జామై ఉస్మానియాలో నివాసం ఉండేవాణ్ణి. అక్కడి రైల్వే గేటు దాటితే ఐదు నిముషాల్లో మా ఇంటికి చేరుకోవ చ్చు. హాస్టల్ పనులు చూసుకోవడానికి కాలినడకన యూనివర్సిటీకి వెళ్లి వచ్చిన రోజులు ఎన్నో. హాస్టల్‌లో విద్యార్థులందరికీ వసతి లభించడం కష్టం. నాకు తెలిసి, బోర్డర్స్‌కు మెరిట్ అనేది ఏమీ ఉండదు. మొదట వచ్చిన వారికి వచ్చినట్లుగా వసతి కల్పించే వాళ్లం. లేనివాళ్లకు ‘వసతి లేదని’ చెప్పేవాళ్లం. వసతి దొరక్క కొందరు విద్యార్థులు ఇబ్బంది పడేవారు. వారిలో పేద విద్యార్థులు కూడా ఉండేవారు. 

అలాంటి వారిలో ‘విష్ణుమూర్తి’ అనే విద్యార్థి హాస్టల్‌లో వసతి దొరక్క పోవడం వల్ల చాలా ఇబ్బందులు పడ్డాడు. ప్రైవేట్ హాస్టల్స్‌లో ఉండడానికి ప్రయత్నించినా అంత డబ్బు కట్టలేక పోవడంతో ఎవరికీ తెలియకుండా ‘ఈన హాస్టల్‌లోని ఒక గ దిలో గుర్తున్న ఒక స్నేహితుని అనుమతితో నాన్ బోర్డర్‌గా ఉన్నాడు. అప్పుడత డు ప్రైవేట్ కళాశాలలో ఎంబీఏ విద్యార్థి. ఒకటి రెండుసార్లు వసతి కోసం నన్ను సం ప్రదించాడు కూడా. కానీ, ప్రయోజనం లే కపోయింది. నాన్ బోర్డర్స్‌ను ఏరివేయడానికి ఆ రోజు అర్ధరాత్రి హాస్టల్ మీద పోలీస్ రైడింగ్ జరిగింది. పోలీసులు కొంతమందిని పట్టుకున్నారు. తర్వాత విడిచి పెట్టా రు. భయపెట్టడానికే ఆ పని చేశారని నా భావన. రైడింగ్ జరిగినప్పుడు విష్ణుమూర్తి ఒక గదిలో తలదాచుకుంటున్నాడు. హాస్ట ల్ ఐడీ కార్డు లేనందున అతడు పోలీసుల కు ‘చిక్కుతానేమో’ అని భయపడ్డాడు. రై డింగ్ నుంచి తప్పించుకుందామని గదినుండి బయటికి వచ్చాడు. కానీ, పోలీసుల కంటపడ్డాడు. 

మానవీయ కోణం

అసలే, అంత రాత్రి వేళ. పోలీసులను చూసి భయపడి పరుగు తీశాడు. రైల్వే గే టు దాటిన అతడు పోలీసులు తరమడం వల్ల మా ఇంటిదాకా వచ్చి తలుపు తట్టా డు. నేనప్పటికి గాఢనిద్రలో ఉన్నాను. నా భార్య ప్రమీల తలుపు తీసింది. అంత రా త్రి అయినా ఆమె తలుపు తీసిందంటే తన ది ఎంత ధైర్యమో. ‘పురుషులు శారీరకం గా బలవంతులైతే, స్త్రీలు మానసికంగా బ లవంతులు. అందుకే, సృష్టిలో వాళ్లిద్దరినీ కలిపి ఆలుమగల్ని చేశాడేమో ఆ భగవంతుడు’ అనిపిస్తుంటుంది నాకు. “మేడమ్! నన్ను పోలీసులు తరుముకొని వస్తున్నా రు. సారు నాకు తెలుసు..” అని ఇంట్లో దూరాడు విష్ణుమూర్తి. ఆపదలో ఉన్నవాళ్లను ఎక్కువగా ఆడవాళ్లే కదా పట్టించుకు నేది. ఏమీ ఆలోచించకుండా మా ప్రమీల అతడు లోపలికి రాగానే తలుపులు వేసిం ది. బహుశా, పోలీసు వాళ్లు చూడనట్టుం ది, ఆ విద్యార్థి మా ఇంట్లోకి రావడం.

“మేడమ్ గారూ! ఆకలవుతున్నది. ఏ మైనా ఉంటే తింటానికి పెడుతారా?” అడిగాడు తరుముకొస్తున్న ఆకలికి ఆగలేక వి ష్ణుమూర్తి. మాది పిల్లలున్న కుటుంబం. ఎ వరైనా అనుకోకుండా వస్తే వారికి ఆతిథ్యమివ్వడాన్ని గౌరవంగా భావించే స్రంపదా యం. ఎలాగైతేనేం, చల్లబడిన అన్నం, చ ట్నీ, అతని ముందు ప్లేట్లో ఉంచి తినమన్నది. అతడు రెండు, మూడు నిముషాల్లో నే తినేశాడు. 

“మేడమ్ గారు! నాకు చాప ఇస్తే మిద్దెమీద పడుకుంటాను..” అన్నాట్ట. ఇంకా, అ తనిలో భయం తొంగి చూస్తూనే ఉంది. మా ప్రమీల అతనికి పడుకోవడానికి ఓ చాప, ఒక చద్దర్ ఇచ్చింది. అతడు మిద్దెమీదికి వెళ్లి పడుకున్నాడు. బహుశా అతనికి నిద్ర పట్టిందో లేదో గాని ఐదు గంటలకే లేచి, మా మేడమ్‌కు థ్యాంక్స్ చెప్పి ఇంటినుంచి బయటపడ్డాడు.

తెల్లవారింది. నేను నా టైమ్‌కు లేచాను. అప్పటికి ఉదయం 6 గంటలు దాటింది. గబగబా లేచి ముఖం కడుక్కొని వచ్చి, హా ల్‌లో కుర్చీలో కూర్చున్నాను. ప్రమీల టీ క ప్పు చేతిలో పెట్టి, అప్పుడు చెప్పింది తీరి గ్గా, రాత్రి జరిగిన సంఘటన. ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టాను. విషయం అర్థమయ్యా క, ప్రమీల ధైర్యాన్ని మెచ్చుకున్నాను. తను హైదరాబాద్ ఓల్డ్ సిటీ అమ్మాయి. ధైర్యవంతురాలు. సహధర్మచారిణిగా ఆమె నా జీవితంలో ఎన్నో మార్కులు కొట్టేసింది కూడా. పెండ్లి తర్వాత నాలో వచ్చిన అనేక మార్పులకు తాను కారణభూతమైంది.

ఆ రోజు మా ఇంట్లో ఆశ్రయం పొంది న విద్యార్థి విష్ణుమూర్తి మమ్మల్ని మరిచిపోలేదు. ముఖ్యంగా మా మేడమ్‌ని అస్స లు మరవలేదు. మా ఇద్దరికీ ప్రతి సంవత్సరం ఉగాదికి ఫోను చేసి శుభాకాంక్షలు చెప్పడం అలవాటు చేసుకున్నాడు. మంచి పదవిలో ఉండికూడా మమ్మల్ని మరిచిపోలేదు. నేను యూనివర్సిటీ నుంచి 2015 ఫిబ్రవరిలో రిటైర్ అయ్యాను. ఏప్రిల్‌లో వచ్చే ఉగాది నాడు అతడు ఫోన్ చేసి మా ట్లాడాడు. ‘తనకు యూపీనుంచి హైదరాబాద్‌కు ట్రాన్స్‌ఫర్ అయినట్లు’ చెప్పాడు. అతడు మాకు కనిపించక పోయినా, ఫోన్‌ద్వారా తన బాగోగులు చెప్పేవాడు. అయి తే, నేను రిటైర్ అయిన మూడు మాసాలకే ప్రమీల కార్డియో అరెస్ట్ కావడం వల్ల దివంగతురాలైంది. ఈ విషయాన్ని విష్ణుమూర్తికి ఫోనుద్వారా తెలియజేశాను. 

అది విని అతను మా ఇంటికి వచ్చి ఎం తోసేపు దుఃఖించాడు. అతని దుఃఖానికి ఎంతో అర్థముంది. అప్పుడు నేనతని దుఃఖ ప్రవాహాన్ని ఆపలేక పోయాను. ‘అబ్బాయిలకూ ఇంత దుఃఖం కల్గుతుందా!’ అని పించింది అతని ఆర్తిని చూసినప్పుడు. ఆ సమయంలో అంత వయసు లో నాకూ దుఃఖం ఆగలేదు. మా ఇద్దరినీ సముదాయించేందుకు అక్కడెవరూ లేరు. ఈ ఘటనలో తప్పు చేసిన విష్ణుమూర్తికి ఆశ్రయం ఇవ్వడమూ మా తప్పే కావచ్చు. కానీ, ఇందులోని మానవీయ కోణాన్ని దర్శించిన వారికి ఆ సమయంలో ఆవేమీ కానరావు. నా శ్రీమతి కూడా అదే చేసిందని సర్దుకున్నాను.

వ్యాసకర్త సెల్: 9885654381