calender_icon.png 12 July, 2025 | 10:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రుణమాఫీ రాజకీయం

24-08-2024 12:00:00 AM

తెలంగాణ రాజకీయం అంతా ఇప్పుడు రైతు రుణమాఫీ చుట్టూ తిరుగుతున్నది. కాంగ్రెస్ ఎన్నికల హామీల్లో ఇది ప్రధానమైంది. తాము అధికారంలోకి వస్తే రూ.2 లక్షల దాకా రైతు రుణాలను మాఫీ చే స్తామని వరంగల్ డిక్లరేషన్‌లో భాగంగా కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఆ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఇదే ప్రధానమైంది. దీంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రోజునుంచే ప్రతిపక్షాలు రుణమాఫీ ఎప్పుడంటూ ప్ర శ్నించడం మొదలుపెట్టాయి. ఆగస్టు 15లోగా హామీ ఇచ్చినట్లుగా రూ. 2 లక్షల దాకా రుణాలను మూడు విడతల్లో మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇవ్వడంతో ఆ సమయం కోసం రైతులు ఆత్రుతతో ఎ దురుచూడడం మొదలుపెట్టారు.

గత నెల 15న రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విడుదల చేయడమే కా కుండా తొలి విడతగా లక్షరూపాయలలోపు రుణాలను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. అన్నట్లుగానే తొలి విడతలో లక్ష రూపాయల రుణాలను మాఫీ చేసిన రేవంత్ సర్కార్ గత నెలాఖరుకు రెండో విడత కింద లక్షన్నర రూపాయల లోపు రుణాలను మాఫీ చేసింది. చివరగా ఈనెల 15న రూ.2 లక్షల లోపు రుణాలను మాఫీ చేసింది. ఖమ్మం వేదికగా జరిగిన సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైతులకు చెక్కులను కూడా అందజేసి ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా తమ ప్రభుత్వం రెండు లక్షల లోపు రైతు రుణాలను ఒకే విడతలో మాఫీ చేసి మాట నిలబెట్టుకుందని ప్రకటించారు.

బీఆర్‌ఎ స్ ప్రభుత్వం లక్షలోపు రుణాలను మాఫీ చేయడానికి అయిదేళ్ల సమయం తీసుకుందని, తాము అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే ఒకే విడతలో రూ. 2 లక్షలలోపు రుణాలను మాఫీ చేశామని సీఎం ఈ సందర్భం గా ప్రకటించారు. బీఆర్‌ఎస్ సర్కార్ మాఫీ చేసిన మొత్తం రుణాలు రూ. 17 వేల కోట్లు మాత్రమేనని, తాము రూ.31 వేల కోట్ల రుణాలను మాఫీ చేశామని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వమని చెప్పడానికి ఇదే నిదర్శనమని ఆయనన్నారు. రేవంత్ సర్కార్ ఆగస్టు 15లోగా రుణాలను మాఫీ చేయడం సాధ్యం కాదని, ఒకవేళ రుణాలను మాఫీ చేస్తే తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేస్తానని సవాలు విసిరిన బీఆర్‌ఎస్ నాయకుడు హరీశ్‌రావు ఇప్పుడు తన పదవికి రాజీనామా చేయాలని అదే సభలో రేవంత్‌రెడ్డి చేసిన సవాలుతో రాజకీయ వివాదం రగులుకుంది. 

ఒకే విడతలో రూ. 2 లక్షల లోపు రైతు రుణాలను మాఫీ చేసేశామని రేవంత్ సర్కార్ చెప్తున్నదంతా అబద్ధమని, అనేక కొర్రీలు పెట్టడంతో చా లామంది రైతులకు రుణాలు మాఫీ కాలేదని, కేవలం 40 శాతం మంది రైతులకు మాత్రమే జరిగిందని బీఆర్‌ఎస్ నేతలు అంటున్నారు. చివరి విడతలో వాస్తవానికి చాలామందికి రుణాలు మాఫీ కాలేదని, చివరికి ముఖ్య మంత్రి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో సైతం రుణమాఫీ జరలేదని, ఈ విషయాన్ని రుజువు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నేతలు సవాలు చేస్తున్నారు.

రాష్ట్రంలోని ఏ గ్రామానికైనా వెళ్దామని, వంద శాతం రుణమాఫీ అయిందని రుజువు చేస్తే అక్కడే తన ఎమ్మె ల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేవె ళ్ల సభలో సవాలు చేశారు. పూర్తి రుణమాఫీ చేయాలంటూ ఆ పార్టీ తెలంగాణ వ్యాప్తంగా ధర్నాలు కూడా నిర్వహించింది. రుణమాఫీ విషయంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు రాజకీయాలు ఆడుతున్నాయని, రేవంత్ స ర్కార్‌కు దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయాలని మరోవైపు బీజేపీ నేత లు డిమాండ్ చేస్తున్నారు.

ఈ రాజకీయం ఇప్పట్లో  ముగియక పో వచ్చు. అయితే, రుణమాఫీలకు సంబంధించి రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి తు మ్మల నాగేశ్వరరావు వివరణ ఇచ్చారు. 2 లక్షలలోపు రుణాలు మాఫీ అ య్యాయని, అంతకు పైబడిన రుణాలు మాత్రం సాంకేతిక కారణాలవల్ల మాఫీ కాలేదని ఆయన అన్నారు. ఉదారణకు ఎవరైనా రైతు 2 లక్షలకు పైబడి రుణం తీసుకుని ఉంటే ఎక్కువ ఉన్న మొత్తాన్ని రైతు ముందుగా చెల్లిస్తే మిగతా రూ. 2 లక్షల రుణం మాఫీ అవుతుందని తుమ్మల చెప్పా రు. మరి, రుణమాఫీలో వాస్తవాలేమిటో బ్యాంకులు, రైతులే చెప్పాలి.