22-12-2025 12:16:23 AM
1120 మీటర్ల పొడవు, 13 మీ టర్ల వెడల్పు
మూడు గ్రామాల ప్రజలు హర్షం ఏఎంసీ చైర్మన్ కుడుదల వెంకన్న
మంథని మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదల వెంకన్న
మంథని, డిసెంబర్-21(విజయ క్రాంతి) మంథని మండలం ఆరింద, వెంకటాపూర్ మానేరుపై బ్రిడ్జి నిర్మాణానికి రూ. 203 కోట్లు నిధులు మంజూరుకు కృషి చేసిన మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటానికి మంథని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న, మాజీ సింగిల్ విండో డైరెక్టర్ రావికంటి సతీష్ , మూడు గ్రామాల ప్రజలు ఆదివారం పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మంత్రి మంథని నియోజక వర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి అగ్రగామిగా నిలుపుతారని పేర్కొన్నారు.
మంథని మల్హర్ మధ్యగల మానేరు నది పై హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి, ఆప్రోచ్ రోడ్డుకు రూ.203 కోట్ల నిధులు మంజూరు పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఆదివారం వెంకటాపూర్, మల్లారం, అరెంద గ్రామాల ప్రజలు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చిత్ర పటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు.
మంథని మండలములోని ఆరెంద మీదుగా దామెరకుంట వరకు 1.120 మీటర్ల పొడవు 13 మీటర్ల వెడల్పుతో హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి, ఆరెంద, మల్లారం, వెంకటాపూర్ నుండి బ్రిడ్జి వరకు అటు సైడు దామేరకుంట రోడ్డు వరకు 9.530 మీటర్ల అప్రోచ్ రోడ్డుకు 203 కోట్ల నిధులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్ అండ్ బి శాఖ నుండి మంత్రి శ్రీధర్ బాబు మంజూరు చేయడం జరిగిందనీ నాయకులు సంబరాలు చేసుకున్నారు.
పెద్దపల్లి జిల్లాలోని ప్రజలు మానేరు బ్రిడ్జి దాటి ఇతర జిల్లాలకు, నదిపై ఆరెంద మీదుగా దామెరకుంట వరకు హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి, మంత్రి శ్రీధర్ బాబు మన మారుమూల ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మూడు గ్రామాల నూతన సర్పంచులు, గ్రామాల ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.