24-11-2025 12:00:00 AM
ససేమీరా అంటున్న రైస్ మిల్లర్లు
కామారెడ్డి జిల్లాలో కొందరు రైస్ మిల్లర్ల మొండివైఖరి
రైతులకు తప్పని నిరీక్షణ
అధికారుల మాటలను పెడచెవిన పెడుతున్న మిల్లర్లు
కామారెడ్డి, నవంబర్ 23 (విజయక్రాంతి): దేవుడు వరమిచ్చిన పూజారి కనికరించడు అనే సామెత లాగా కామారెడ్డి జిల్లాలో రైతుల పరిస్థితి నెలకొంది. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్ రైతులకు ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు చేపట్టి రైస్ మిల్లర్లు ధాన్యాన్ని దించుకోవాలని కోరుతున్న మిల్లర్లు మాత్రం ససమేరా అంటున్నారు. దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
లారీల్లో ధాన్యాన్ని తీసుకెళ్లి రైస్ మిల్లుల వద్ద నిరీక్షిస్తున్నారు. అధికారుల మాటను కొంతమంది రైస్ మిల్లర్లు పెడచెవిన పెడుతున్నారు. దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే నత్త నడకన ధాన్యం కొనుగోలు సాగుతుండగా మరో వైపు మిల్లర్లు ధాన్యాన్ని దించుకునేందుకు రైస్ మిల్లు యజమాన్యాలు దొడ్డు వడ్లు వద్దు అంటూ కరాకండిగా చెబుతున్నారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
అధికారులు చెప్పిన రైస్ మిల్లర్లు వినడం లేదని రైతు లు ఆరోపిస్తున్నారు. రైస్ మిల్లర్ యజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సివిల్ సప్లై అధికారులు జోక్యం చేసుకొని ధాన్యాన్ని తొందరగా కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి, దోమకొండ, బిక్కనూర్, ఎల్లారెడ్డి, నిజాంసాగర్, మండలాల్లోని రైస్ మిల్లర్లు దొడ్డు వడ్లు దించుకునేందుకు ససేమేరా అంటున్నారు.
దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. స్థానిక నాయకులు జిల్లా కలెక్టర్ దృష్టికి, సివిల్ సప్లై అధికారుల దృష్టికి తీసుకెళ్లిన రైస్ మిల్లర్ లు స్పందించడం లేదని రైతులంటున్నారు. మరోవైపు తుపాను వస్తుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తొందరగా రైస్ మిల్లర్లు ధాన్యాన్ని తూకం వేసి కొనుగోలు చేయాలని రైతులు డిమాం డ్ చేస్తున్నారు.
కొన్నిచోట్ల కొనుగోలు కేంద్రాలు నిలిచిపోవడం, మరోవైపు ధాన్యం సేకరణ కేంద్రాలు పనిచేయడం లేదని దానికి కారణం రైస్ మిల్లర్లు ధాన్యం తీసుకెళ్లిన లారీలను లోడ్ కాళీ చేయకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తు తున్నాయని రైతులంటున్నారు. ప్రభుత్వం కొనుగోలు చేసినప్పటికీ రైస్ మిల్లర్లు ధాన్యాన్ని దించుకోకపోవడంతో సమస్య తలెత్తుతుందని రైతులు వాపోతున్నారు.
ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న రైస్ మిల్లర్ల పై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ధాన్యాన్ని తొందరగా లోడ్ ఖాళీ చేసే విధంగా రైస్ మిల్లర్ యజమాన్యాలపై అధికారులు ఒత్తిడి తీసుకురావాలని రైతులు కోరుతున్నారు.
రైతులకు తప్పని నిరీక్షణ
ధాన్యం అమ్మేందుకు రైతులకు నిరీక్షణ తప్పడం లేదు. కామారెడ్డి జిల్లాలో రైస్ మిల్లర్ల నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. తుఫాను వస్తే దాన్యం తడిసి ఇబ్బందులు తలెత్తుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. రైస్ మిల్లర్లు మాత్రం నిర్లక్ష్యంగా రైతులకు సమాధానం చెబుతున్నారు. లారీ ధాన్యాన్ని అన్లోడ్ చేసే వరకు రైతులు నిరీక్షిస్తున్నారు. రైస్ మిల్లుల వద్ద లారీలు ధాన్యం లోడుతో నిలిచి పోతున్నాయి.
అధికారులు మాత్రం ఆదేశాలు జారీ చేస్తున్నాం కానీ రైస్ మిల్లర్లు స్పందించడం లేదని చెప్తున్నారు. అధికారులే అలా చెప్తుంటే రైతుల మాటను రైస్ మిల్లర్లు పెడచెవిన పెడుతున్నారు. దీంతో రైతులు రైస్ మిల్లుల వద్ద నిరీక్షిస్తూ ఇబ్బందులు పడుతున్నారు.
ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకుని నిరీక్షిస్తున్న రైతుల ధాన్యాన్ని అన్లోడ్ చేసే విధంగా స్థానిక అధికారులు చర్యలు తీసుకోవాలని రైతుల కోరుతున్నారు. ఇప్పటికైనా రైస్ మిల్లర్లు స్పందించి మిల్లుల వద్ద ధాన్యంతో ఉన్నలారీలు తొందరగా అన్లోడ్ చేసి రైతుల ఆందోళన చెందకుండా చర్యలు చేపట్టాలని అధికారులను రైతులు కోరుతున్నారు.
నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు : కామారెడ్డి అదనపు కలెక్టర్ విక్టర్
కామారెడ్డి జిల్లాలో రైస్ మిల్లర్లు రైతుల ధాన్యాన్ని అన్లోడ్ చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ ను సదాశివ నగర్ మండలం బొంపల్లి గ్రామ రైతులు దృష్టికి తేవడంతో వెంటనే స్పందించి రైస్ మిల్లర్ ఒత్తిడి తెచ్చి ధాన్యాన్ని అన్లోడ్ చేయించారంటే రైస్ మిల్లర్ల నిర్లక్ష్యం ఏ మేరకుందో ఏ మేరకుందో అర్థం చేసుకోవచ్చు. భిక్కనూరు మండల రైతులు సైతం ధాన్యాన్ని అన్లోడ్ చేయడం లేదని రైస్ మిల్లర్ లపై రైతులు ఫిర్యాదు చేశారు. జిల్లావ్యాప్తంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు.