24-11-2025 12:00:00 AM
కామారెడ్డి, నవంబర్ 23 (విజయక్రాంతి): కామారెడ్డి ఎన్జీవోస్ కాలనీలోనీ లలిత త్రిపుర సుందరి దేవి ఆలయ అభివృద్ధి పనులను ఆదివారం ఆలయ కమిటీ ప్రతినిధుల ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక విశిష్ట అతిథులుగా ప్రముఖ వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ ఆచార్యతంలో పూజా కార్యక్రమం నిర్వహించారు.
వర హై రాజ్యశ్యామల లలిత త్రిపుర సుందరి క్షేత్ర అభివృద్ధి పనులలో తమ వంతు సేవ చేసు కునే వారు అర్చకులను ఆలయ కమిటీ ప్రతినిధులను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు సిద్ది రెడ్డి, కార్యదర్శి దామోదర్, కోశాధికారి శ్రీనివాస్, అర్చకులు వినోద్ శర్మ, ఉమేష్ శర్మ, రామశర్మ, ప్రవీణ్ శర్మ,తదితరులు పాల్గొన్నారు.