calender_icon.png 20 November, 2025 | 2:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడా ప్రాంగణాలు.. గడ్డి మొక్కలతో దర్శనం

20-11-2025 12:00:00 AM

నిర్వహణ లేక వెల వెల

యాచారం నవంబర్ 19 : గ్రామీణ యువతను ప్రోత్సహించేందుకు గత ప్రభు త్వం లక్షల రూపాయలు వెచ్చించి క్రీడా ప్రాంగణాలను  ఏర్పాటు చేస్తే... ప్రస్తుతం వాటి నిర్వహణను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో క్రీడా స్థలాలు అన్నీ పిచ్చి మొక్కలతో దర్శనం ఇస్తున్నాయి. 

అధికారుల అలసత్వంకారణంగా యాచారం మండలం లో పలు గ్రామాల లో పరిస్థితి ఇలా నే తయారయ్యిందని క్రీడా కారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  మాల్  గ్రామం లో ఉన్న క్రీడాప్రాంగణం నిండా గడ్డి పెరిగి ఆటలు ఆడే వీలు లేకుండా ఉంది.  ఇప్పటికైనా పంచాయతీ అధికారులు స్పందించి మైదానంలో  మొలసిన గడ్డి మొక్కలను తొలగించి క్రీడాకారులకు అందుబాటులోకి  తిసుకు రావాలని స్థానికులు కోరుతున్నారు.