04-01-2026 12:00:00 AM
ఆస్పత్రిలో బంధువుల పరామర్శకు వెళ్లిన రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, జనవరి 3 (విజయక్రాంతి) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయం నుంచి ముంబై కు వెళ్లారు. ముంబైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో సీఎం అత్త అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతుండటంతో.. వారిని పరామర్శించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ముంబైకి వెళ్లినట్లుగా తెలిసింది. తిరిగి ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు రానున్నారు.