calender_icon.png 7 May, 2025 | 7:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మన కుటుంబం సినిమా టైలర్ రిలీజ్

04-05-2025 12:33:02 AM

మహేశ్వరం, ఏప్రిల్3 : కలకొండ క్రియేషన్స్ పై కలకొండ హేమలత, నర్సింహ నిర్మాతలుగా గ్రామీణ, కుటుంబ నేపథ్యంలో నిర్మిచిన మన కుటుంబం సినిమా ఈ నెల 9వ తేదీన విడుదల కాబోతున్న సందర్భంగా శనివారం కర్మన్ ఘాట్ శ్రీ జ్ఞాన ఆంజనేయ స్వామి దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ పూజా రి చేతుల మీదుగా సినిమా టైలర్ రిలీజ్ చేశారు.

ఈ సినిమా లో ప్రముఖ నటుడు సుమన్, మురళీధర్ గౌడ్, అన్నపూర్ణ ప్రధా న పాత్రలో నటించారు. హీరోలుగా వర్మ, నర్సింహ, హీరోయిన్ లుగా నిమా చౌదరి, లాస్య నటించారు. ఈ సందర్భంగా నిర్మాతలు కలకొండ హేమలత, నర్సింహ మాట్లా డుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ఉమ్మడి కుటుంబాల్లో ఉండే ప్రేమ, ఆప్యాయత.

కష్ట సుఖాలు సినిమా లో ప్రతి ప్రేమ్ లో అద్భుతంగా వచ్చాయన్నారు. కుటుంబం లో పెద్ద మరణించిన సమయంలో వచ్చే పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్నారు.ఏప్రిల్9వ తేదీన 30 థియేటర్లు లో సినిమా విడుదల అవుతుందని, ప్రతి ఒక్కరూ సినిమా ను చూసి అభినందించాలి అని ఆయన కోరారు.