24-07-2024 11:45:15 AM
ఆర్టీసీ కార్మికులను అభినందిస్తున్నాం
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికులు 50 రోజులు సమ్మె చేసినా గతంలో పట్టించుకోవలేదని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఆర్టీసీ అంశాన్ని బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని మంత్రి పొన్నం విమర్శించారు. యూనియన్లు రద్దు చేసి ఇప్పుడు పునరుద్ధరణ మాట్లాడుతున్నారని పొన్న ఫైర్ అయ్యారు. ఆర్టీసీ సొమ్మును గత ప్రభుత్వం వాడుకుందని ఆయన వెల్లడించారు. ఆర్టీసీకి తాము నెలకు 300 కోట్లు ఇస్తున్నామని పేర్కొన్నారు.
ఆర్టీసీకి కొత్త బస్సులు కొంటున్నాం.. ఆర్టీసీలో 30,035 మంది ఉద్యోగులను నియమిస్తున్నామని మంత్రి పొన్నం పేర్కొన్నారు. పనిభారం పెరిగినా ఆర్టీసీ కార్మికులు బాగా పని చేస్తున్నారని మంత్రి ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులను పొన్నం ప్రభాకర్ అభినందించారు. ఎన్నికల ముందు ఆదరబాదరాగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారని ఆరోపించారు. ఆర్టీసీకి ఇవ్వాల్సిన బకాయిలు తాము చెల్లించామన్నారు. ఆర్టీసీ కార్మికులపై బీఆర్ఎస్ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమం తమ బాధ్యత అన్న మంత్రి ఆర్టీసీ గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ కు లేదని తేల్చిచెప్పారు.