calender_icon.png 20 November, 2025 | 2:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీసీని ప్రభుత్వంలో ఎప్పుడు విలీనం చేస్తారు..?

24-07-2024 11:30:22 AM

హైదరాబాద్: శాసనసభలో ఆర్టీసీ అంశంపై చర్చ జరుగుతోంది. ప్రశ్నోత్తరాల సమయంలో ఆర్టీసీపై వాడీవేడీ చర్చ కొనసాగుతోంది. ఆర్టీసీలో ఖాళీగా ఉన్న పోస్టులను ఎప్పుడు భర్తీ చేస్తారు?.. ఆర్టీసీని ప్రభుత్వంలో ఎప్పుడు విలీనం చేస్తారు? అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రశ్నించారు. ఆర్టీసీ విలీనంపై ఎప్పటిలోగా అపాయింట్ డేట్ ప్రకటిస్తారని హరీశ్ రావు ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికులను పీఆర్ సీ పరిధిలోకి తెస్తామన్నారు. పీఆర్ సీ బకాయిలు ఎప్పటిలోగా చెల్లిస్తారు? అని ప్రశ్నించారు. ఫిబ్రవరి 10నే సీఎం చెక్కు చూపించారు.. ఇంకా చెల్లించలేదు.. నెక్లస రోడ్ నుంచి బస్ భవన్ కుచెక్కు ఎప్పుడు చేరుతుంది? అని హరీశ్ ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమంపై కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు. కార్మికుల యూనియన్ పునరుద్ధరణ ఎప్పుడు చేస్తారు?.. పీఆర్ సీ బకాయిలు ఎప్పటిలోగా చెల్లిస్తారు?. ఆర్టీసీ కార్మికులతో అదనపు గంటలు పనిచేస్తున్నారని హరీశ్ రావు పేర్కొన్నారు.