23-09-2025 12:00:00 AM
ములుగు, సెప్టెంబరు 22 (విజయక్రాంతి) : ములుగు జిల్లా ఎస్‌ఎస్ తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క సారలమ్మ తల్లులను రాష్ట్ర పంచాయితి రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ,శిశు సంక్షేమ, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్, ఎస్పి షభరిష్‌లతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సమ్మక్క సారలమ్మ దేవాలయంను సందర్శించనున్న నేపద్యంలో చేపట్టుతున్న.
పనులను మంత్రి సీతక్క పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు, దిశా నిర్దేశించారు. ఈ సమావేశంలో ఏఎస్పి శివం ఉపాధ్యాయ, అదనపు కలెక్టర్ రెవిన్యూ సి హెచ్ మహేందర్ జి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, ఆర్డీఓ వెంకటేష్, పూజారుల సంఘం అధ్యక్షుడు జగ్గరావు, ఈఓ వీరస్వామి, ఏ పి ఓ వసంత రావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
మండల కేంద్రంలో పర్యటించిన మంత్రి సీతక్క..
మంగపేట, సెప్టెంబరు 22 (విజయక్రాంతి):సోమవారం మండల కేంద్రంలో పర్యటించిన మంత్రి సీతక్క పర్యటనలో భాగంగా అకాల వర్షాలతో వచ్చిన వరదలకు నష్టపోయిన కమలాపురం ఇందిర కాలనీ వాసులకు దుప్పట్లను పంపిణీ చేశారు ఇందిరకాలనీ ముంపుకు కారణమైన ఎర్రవాగులోని చెట్లను తొలగింపును పర్యవేక్షించారు అనంతరం మండల కేంద్రం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
అదేవిధంగా ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ కర్రీ నాగేంద్రబాబు తండ్రి నర్సయ్య అనారోగ్య కారణంతో మరణించగా వారి కుటుంబ సభ్యులను మంత్రి సీతక్క పరామర్శించి ఓదార్చి ధైర్యాన్ని చెప్పి నర్సయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడకుల అశోక్ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవి చందర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగా కళ్యాణి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మైల జయరామ్ రెడ్డి మండల, గ్రామ పార్టీ నాయకులు పాల్గొన్నారు.