29-01-2026 12:00:00 AM
ఆర్యవైశ్య సంఘం అన్నదాన శిబిరం ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు
మంథని, జనవరి 28(విజయ క్రాంతి) మంథని నుండి మేడారం జాతరకు వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా బస్సులను అందుబాటులో ఉంచాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంథని డిపో మేనేజర్ ను ఆదేశించారు. బుధవారం మంథని బస్టాండ్ లో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపు గురించి తెలుసుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగామేడారం జాతరకు వెళ్లే భక్తులకు బస్ స్టేషన్ ఆవరణలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయగా శ్రీధర్ బాబు ముఖ్యఅతిథిగా హాజరై అన్నదాన శిబిరాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ మంథని ఆర్యవైశ్య సంఘ సోదరులు ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు నల్లమాసు ప్రభాకర్, ఆర్యవైశ్య సంఘం మంథని అధ్యక్షులు ఎల్లంకి వంశీ, ఆర్య వైశ్య సంఘం నాయకులు కొమురవెల్లి విజయ్ కుమార్, రావికంటి సతీష్, ఓల్లల నాగరాజు, రేపాల రమేష్, కొమురవెల్లి భాస్కర్, మహారాజ శ్రీనివాస్, రాచర్ల నాగరాజు, రావి కంటి మనోహర్, ఎల్లంకి రాధిక, రేపాల ఉమాదేవి, రాచర్ల తిరుమల లతో పాటు ఆర్యవైశ్య సంఘం సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.