calender_icon.png 23 November, 2025 | 4:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హరీశ్ రావు వ్యాఖ్యలకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్

27-07-2024 03:05:23 PM

హైదరాబాద్: హరీశ్ రావు వ్యాఖ్యలకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. ఆర్థిక వ్యవస్థను బీఆర్ఎస్ అస్తవ్యస్తం చేసిందన్నారు. తాము అధికారంలోకి వచ్చి ఏడు నెలలే అయ్యిందన్న మంత్రి  అన్ని హామీలు అమలు చేస్తామని పేర్కొన్నారు. అంతకు ముందు సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యాలకు హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. బతుకమ్మ చీరల విషయంలో సీఎం వ్యాఖ్యలు సరికాదన్నారు. సీఎం వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని హరీష్ కోరారు. ఇచ్చిన హామీల అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలం అయిందన్నారు. గత ప్రభుత్వంపై ఆరోపణలు మానుకోవాలని సూచించారు. సీఎం అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానమిస్తామని హరీష్ రావు తెలిపారు.