23-11-2025 01:15:51 AM
ముఖ్యఅతిథిగా శ్రీనిధి యూనివర్సిటీ ప్రోఛాన్స్‌లర్ నరసింహారెడ్డి
మేడిపల్లి, నవంబర్ 22 (విజయక్రాంతి) : మేడిపల్లి లో శనివారం నాడు సెజ్ పాఠశాల ప్రాంగణంలో ఈ కార్నివాల్ కార్యక్ర మం అత్యంత వైభవంగా జరిగింది.నామట్టి - నాదేశం అనే నినాదముతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ నిధి యూని వర్శిటి ప్రో ఛాన్స్లర్ నరసింహారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా ఈ ఎస్ నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థుల, ఉపాధ్యాయుల కృషిని ప్రశంసిస్తూ అభినందిం చారు.
సేజ్ పాఠశాల విద్యార్థులందరూ సమిష్టిగా శ్రమించి సమగ్ర భారతావనిని ఈ కార్నివాల్ లో ఆవిష్కృతం చేశారు.భాషలు, సంస్కృతులు, వైద్య, రవాణ, కృత్రిమ మేధస్సు లాంటి అనేకమైన ప్రాచీనం నుండి నేటి ఆధునికత వరకే కాకుండా భవిషత్ లో ఎలాంటి సాంకేతికత రాబోతుందో తము నమూనాల ద్వారా విదార్థులు ఈ కార్నివాల్ లోప్రదర్శించారు.
ఈ నమూనాలు విద్యార్థుల తల్లి దండ్రులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమము లో ప్రిన్సిపల్ చైత్రరెడ్డి, అకాడమీ డైరెక్టర్ సీతామహాలక్ష్మి, డైరెక్టర్ రోహిత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.కార్యక్రమమును విజయవంతం చేసినందుకు విద్యార్థినీ, విద్యార్థుల కు, ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలుపుతూ నామట్టి - నాదేశం అనే నినాదాన్ని ప్రతిజ్ఞ చేశారు.