26-10-2025 12:35:38 AM
హైదరాబాద్, అక్టోబర్ 25 (విజయక్రాంతి): వ్యవసాయ, మార్కెటింగ్, సహ కార, హ్యాండ్లూమ్, టెక్సుటైల్స్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం రాష్ట్ర సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో రాష్ర్టంలో పత్తి కనీస మద్దతు ధర కొనుగోలు, కోహెడా మార్కెట్ ప్రగతి స్థితి, మార్కెటింగ్ శాఖలో కొత్తగా ఆమోదించిన పనుల పురోగతి, సోయా, మక్కజొన్న కొనుగోలు కార్యక్రమాల పురోగతి, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో మంత్రి సమీక్షించారు. అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.