21-05-2025 06:19:47 PM
బచ్చన్నపేట (విజయక్రాంతి): వాస్విక్ ఫౌండేషన్(Vaaswik Foundation) వారి వితరణ బచన్నపేట మండలం కేశిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తుడుము సంతోష, క్రీ.శే ఐలయ్య కుమార్తె సుకన్య వివాహానికి, బచన్నపేట మండలం బసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన చెప్యాల యాధలక్ష్మి క్రీ.శే కనకయ్య కూతురు ప్రియాంక వివాహానికి వాస్విక్ ఫౌండేషన్ చైర్మన్ నిడిగొండ నరేష్ కుమార్(Vaaswik Foundation Chairman Nidigonda Naresh Kumar), వైస్ చైర్మన్ నూకల భాస్కర్ రెడ్డిలు పుస్తె మట్టెలను, 5000 రూపాయల నగదు మల్లవరం సుష్మిత వెంకటేశ్వర్లు రెడ్డి చేతుల మీదుగా అందివ్వడం జరిగింది.
ఈ పేదింటి కూతురి వివాహానికి వారి ఆర్థిక పరిస్థితులను తెలుసుకున్న వాస్విక్ ఫౌండేషన్ చైర్మన్, వైస్ చైర్మన్ వారికి పుస్తె మట్టలను కానుకగా బచ్చన్నపేట మండలంలోని వారి ఇంటి వద్దకు వెళ్ళి కుటుంబ సభ్యుల సమక్షంలో కానుకగా ఇవ్వడం జరిగింది. అనంతరం వారి కుటుంబ సభ్యులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఫౌండేషన్ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో ఆముదాల భూపాల్ రెడ్డి, నూకల నర్సిరెడ్డి, నూకల రమేష్ రెడ్డి, గొట్టే చంద్రమౌళి, కక్కెర్ల ఉపేందర్, సూర్య భాయ్, పిల్లి ఆంజనేయులు, బాలరాజు గౌడ్, సాగర్, గాలి తిరుపతి, సందీప్, నర్సింగ రావు, రమ్య తదితరులు పాల్గొన్నారు.