21-05-2025 05:53:46 PM
కూకట్‌పల్లి (విజయక్రాంతి): బాలానగర్ సీఐ నర్సింహ రాజు ఉత్తమ ఎస్‌హెచ్‌ఓగా ఎంపికైన సందర్భంగా బుధవారం తెలంగాణ రాష్ట్ర డిజిపి జితేందర్(Telangana State DGP Jitender) చేతుల మీదగా ప్రశంసా పత్రంతో పాటు నగదు బహుమతిని అందుకున్నారు. ఈ సందర్భంగా బాలనగర్ ఎస్‌హెచ్‌ఓ నరసింహా రాజు మాట్లాడుతూ... తాను పోలీసు ఉద్యోగంలో చేరిన రోజు కంటే ఉత్తమ పోలీస్ అధికారిగా ఎంపికైనందుకు ఆనందంగా ఉందన్నారు.
పోలీసు ఉద్యోగంలో చేరినప్పటి నుండి ప్రజల దైనందిన జీవితాల్లో వెలుగు చూడాలన్న ఉద్దేశంతో పోలీసు ఉన్నతాధికారుల ఆలోచనలు, సలహాలు తీసుకుంటూ క్రమశిక్షణతో విధులు నిర్వర్తించడం మూలంగానే తనకు ఈ అవార్డు లభించిందన్నారు. తనకు సలహాలు ఇచ్చి ముందు నడిపించిన ఉన్నతాధికారులకు ప్రత్యేకించి ప్రజలకు ఈ అవార్డును అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ అవార్డుతో తనకు మరింత బాధ్యత పెంచిందని భవిష్యత్తులో సమాజా ఆభివృద్ధికి నా వంతు బాధ్యతగా పనిచేస్తానని స్పష్టం చేశారు. ఉత్తమ ఎస్‌హెచ్‌ఓ లో తొమ్మిదవ స్థానం లభించడం గర్వంగా ఉందన్నారు.