21-05-2025 06:22:39 PM
కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్..
కూకట్‌పల్లి (విజయక్రాంతి): సాంకేతిక విప్లవానికి నాంది పలికి ఆర్థిక రంగాలలో భారత్ ను బలమైన దేశంగా నిలిపిన ఘనత రాజీవ్ గాంధీకి దక్కిందని ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్(Corporator Dodla Venkatesh Goud) అన్నారు. బుధవారం మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి పురస్కరించుకొని ఆయన కార్యాలయంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు.
అనంతరం వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ... దేశంలో పేదరికాన్ని రూపుమాపి సమ సమాజ స్థాపన కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. యువతలో శక్తివంతమైన మార్పును ఆకాంక్షించి కంప్యూటర్ యుగానికి నాంది పలికారని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, శివరాజ్ గౌడ్, షౌకత్ అలీ మున్నా, సయ్యద్, పోశెట్టి గౌడ్, బాలస్వామి, ఖలీమ్, రాజ్యలక్ష్మి, రమాదేవి, సౌందర్య, అరుణ తదితరులు పాల్గొన్నారు.