21-05-2025 05:59:39 PM
బచ్చన్నపేట (విజయక్రాంతి): జనగామ డీసీసీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి(DCC President Kommuri Pratap Reddy) ఆదేశాల మేరకు బచ్చన్నపేట మండల ప్రధాన కార్యదర్శి అల్వాల ఎల్లయ్య, టౌన్ అధ్యక్షుడు కోడూరి మహాత్మాచారి, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జంగిటి విద్యానాథ్ బచ్చన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి నివాళులర్పించడం జరిగింది. బచ్చన్నపేట మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, వృద్ధులకు, బాలింతలకు బ్రెడ్, పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ ఆశయాలను కొనసాగించాలని కొనియాడారు.
విప్లవాత్మకమైన కంప్యూటర్ యుగానికి కంప్యూటర్ యుగానికి నాంది పలికిన మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ తన కుటుంబ నేపద్యమే భారతదేశానికి ఆదర్శమని అన్నారు. వారి కుటుంబం నెహ్రు, ఇందిరా, రాజీవ్ గాంధీ కూడా భారత దేశ ప్రజలందరినీ ఏకతాటిపై తీసుకువచ్చిన మహనీయుల కుటుంబమని అన్నారు. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థిని, యువకులకు కంప్యూటర్ యుగానికి భవిష్యత్తు ఉందని ఆనాడే గుర్తించిన రాజీవ్ గాంధీ అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో కిసాన్ సేల్ జిల్లా అధ్యక్షుడు పిన్నింటి నారాయణరెడ్డి, మాజీ ఎంపిటిసిలు, నల్లగోని పుష్ప బాలకిషన్, ఎండి మసూద్, మాజీ సర్పంచులు గిద్దల రమేష్, పిన్నింటి బాపురెడ్డి, జిల్లా ఓబిసి వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి శ్రీనివాస్, బచ్చన్నపేట గ్రామ ఉపాధ్యక్షుడు గంధ మల్ల క్రిష్టయ్య సీనియర్ నాయకులు దిడ్డిగ రమేష్, అమృత రెడ్డి, గుర్రపు బాలరాజు, పంది పల్లి నర్సిరెడ్డి, గార్లపాటి మహిపాల్ రెడ్డి, సద్ది నర్సిరెడ్డి, కళ్లెం రమేష్, కోక్కలకొండ బాబు, పెద్దటి శ్రీనివాస్, బొమ్మెన రాజయ్య, తమ్ముడి మహేందర్, ఎర్రోళ్ల రాజు, సందేల రాము, కంటెం కరుణాకర్, మచ్చ సుధాకర్, ఆరే మోహన్, ఎండి జహంగీర్, అందే సంజయ్, కొయ్యడ శీను, ఎల్లారెడ్డి, బోడ పట్ల ఐలయ్య, బడే కోల్ శ్రీనివాస్ రెడ్డి, నర్మెట ఆంజనేయులు, నిమ్మ కరుణాకర్ రెడ్డి కర్రే లక్ష్మయ్య, ఎండి షాబుద్దీన్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.