21-05-2025 06:29:49 PM
బచ్చన్నపేట (విజయక్రాంతి): జనగామ జిల్లాలో కాటమయ్య రక్షణ కవచం కీట్లను కల్లుగీత కార్మికులకు ఇవ్వడం జరిగింది. బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి బి రవీందర్(BC Welfare District Officer B Ravinder), ఎంపీడీవో మల్లికార్జున్, జిల్లా కోఆర్డినేటర్ బాల్నే వెంకట మల్లయ్య బుధవారం బచ్చన్నపేట మండలంలోని గ్రామాలలో బచ్చన్నపేట కొన్నె, ఇటిక్యాలపల్లి, సల్వాపూర్, నాగిరెడ్డిపల్లి, రామచంద్రపురం, బసిరెడ్డిపల్లి, కేశరెడ్డిపల్లి, బండనాగారం, కట్కూర్ కల్లుగీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచం కిట్లను అందజేయడం జరిగింది.
వారితో పాటు జూనియర్ అసిస్టెంట్ ఇర్ల కుమారస్వామి, వి. శేఖర్, గడ్డం సురేష్, ట్రేనర్స్ వడ్లకొండ వెంకటేష్, బొమ్మెన రాజయ్య, మండల అధ్యక్షులు యాదండ్ల పరంధామ, పంచరాజు సెక్రటరీ భరత్, బైరగోని బలరాములు, టిసిఎస్ అధ్యక్ష కార్యదర్శలు గూడెపు తిరుపతి, కక్కర్ల రాజు బత్తిని యాదగిరి బత్తిని రవి, రమేష్ యాదన్ల శ్రీనివాసు, తీగల దయాకర్, నేరెళ్ల రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.