21-05-2025 06:34:27 PM
జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశము..
కలెక్టర్ ఆశిష్ సంగువాన్..
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో అక్రమంగా ఇసుక తరలించకుండా చెక్ పోస్టులను ఏర్పాటు చేయడంపై జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్(District Collector Ashish Sangwan) అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ఈ సమావేశంలో బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గంలోని హస్గుల్, కుర్లా గ్రామాలకు స్టానిక అవసరాలకు సంబoధించి ఇసుక లభ్యత, దాని పర్యావరణ అనుమతులు, మట్టికీ సంబంధించి కనీస పరిమాణములో స్థానిక అవసరాలకు తహసీల్దారులకు అనుమతి ఇచ్చి సులబమైన పద్దతి, ఇసుక రవాణా నియంత్రించడంలో చెక్ పోస్టులు పెట్టేందుకు కావలసిన ఏర్పాట్ల గురించి జిల్లా కమిటీ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వి. విక్టర్, అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి, నాగేశ్, సహాయ సంచాలకులు గనులు, భూగర్భశాఖ(ఇంచార్జ్), సతీశ్ యాదవ్, జిల్లా భూజల శాఖ, సాలుమాను, ఈఈ ఇరిగేషన్ శాఖ, శ్రీనివాస్, ఇతర అదికారులు పాల్గొన్నారు.